calender_icon.png 7 November, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత సంతతి చెరగని ముద్ర

07-11-2025 12:05:53 AM

ముచ్చుకోట సురేష్ బాబు :

అమెరికాలో భారతీయ మూలాలున్న నాయకులు కీలక రాజకీ య పదవులు అధిరోహిస్తున్న సందర్భమిది. ఆ దేశంలో ఇటీవలి ఎన్నికల్లో పలువురు భారతీయ- అమెరికన్లు పలువురు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో భారత సంతతి నాయకుల ఎదుగుల అమెరికా రాజకీయాలను శాసించే స్థితికి చేరుకున్నట్లుగా అనిపిస్తున్నది. ప్రధానంగా న్యూయార్క్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో జొహ్రాన్ మమ్దానీ అసామాన్య విజయం సాధించి ప్రథమ పౌరునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

34 ఏళ్ల మమ్దానీ న్యూ యార్క్ నగర మేయర్ అయిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ అమెరికన్ ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డులు సృష్టించారు. జనవరి 1న మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.  ఉగాండా, భారతీయ మూలాలున్న తల్లిదండ్రులకు జన్మించిన మమ్దానీ.. న్యూ యార్క్ నగరంలో పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే తన లక్ష్యమని వెల్లడించారు. న్యూయార్క్ నగరంలో ఉచిత బ స్సు ప్రయాణం అమలు చేస్తానని ప్రకటించారు.

నెలల పిల్లల నుంచి ఐదేళ్ల వయ స్సు ఉన్న పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు ఉచిత చైల్డ్ డే కేర్ సెంటర్లు ప్రా రంభిస్తానని మరో హామీ ఇచ్చారు. సంపన్నులపై, కార్పొరేట్ సంస్థలపై పన్నులు పెంచుతానని.. ఇళ్ల అద్దెలపై నియంత్రణ విధిస్తానని హామీనిచ్చి పేదలను ఆకట్టుకున్నారు.

అదే సమయంలో ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలను జొహ్రాన్ విపరీతంగా ఎండగట్టారు. జొహ్రాన్  చిన్న వయస్సులోనే సమకాలీన అంశాలను సమగ్రంగా విశ్లేషించిన వ్యక్తిగా పేరు గాంచారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన దాడులను జొహ్రాన్ మొదటి నుం చి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. 

వివక్షలో పుట్టి పెరిగి

జొహ్రాన్ మమ్దానీ 1991లో ఉగాండాలోని కంపాలలో జన్మించారు. తల్లి మీరా నాయర్, తండ్రి మహ్మద్ మమ్దానీ. ఇద్ద రూ భారతీయులే. బాలీవుడ్ చిత్రరంగం లో అవార్డులు కొల్లగొట్టిన ప్రముఖ చిత్రా లు ‘సలాం బాంబే’, ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ వంటి సినిమాలను తెరకెక్కించింది మీరా నాయరే. జొహ్రాన్‌కి ఐదేళ్లప్పుడు అతని కుటుంబం దక్షిణాఫ్రికాకి వెళ్లి, ఆ తరువాత న్యూయార్క్ నగరంలో స్థిరపడింది. బా ల్యం నుంచి న్యూయార్క్ వీధుల్లో పెరిగిన జొహ్రాన్ ఎన్నోసార్లు వివక్షను ఎదుర్కొన్నారు.

‘నా స్నేహితుడు ఒకసారి నన్ను.. ‘మీరు సనాతన వాదులు కారు’ అని తన ను వివక్షకు గురి చేసిన మాటలను జొహ్రా న్ గుర్తుచేసుకున్నారు. ‘మేము బుద్దిమంతులం, తెలివైనవాళ్లం. మా కుటుంబంలో ప్రార్థన ఉంది. కవిత్వమూ ఉంది. మా ఇం ట్లో ఉర్దూ గజల్స్ ఉంటాయి. ఆఫ్రికన్ జానపద కథలు వినిపిస్తాయి’ అని తన మిత్రునికి వివరించినట్లు చెప్పారు. ‘తనని ఇంతటి శక్తిమంతుడిగా తీర్చిదిద్దింది అమ్మానాన్నే’ అని జొహ్రాన్ గర్వంగా చెబుతారు.

‘వలస వెతలు, బాల కార్మికులు, గుర్తింపు, సంస్కృతి వంటి ఇతివృత్తాలను అద్భుతంగా తెరపై తెరకెక్కించిన తల్లి పెంపకంలో తాను ఉన్నతంగా ఎదిగానని జోహ్రాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చా రు. మరో సందర్భంలో తన తల్లి గురించి జొహ్రాన్ ప్రస్తావిస్తూ.. ‘హ్యారీ పోర్టర్ లాంటి సినిమాలని ఏ మంచి దర్శకుడైనా రూపొందిస్తారు. కానీ అమ్మ తీసిన చిత్రా లు కేవలం ఆ వ్యక్తులు, వాళ్ల బాధలను పట్టించుకునే వ్యక్తులకు మాత్రమే సాధ్యం.

సమాజంలో వివక్షకు గురవుతున్న వర్గాల పట్ల నా తల్లిదండ్రులు నిలబడడం నిజం గా నాకు గర్వకారణం. వాళ్లు చెప్పిన కథ లు గ్లామర్‌గా ఉండవు. అవి సృజనాత్మకతని, విలువైన విషయాలు, ప్రపంచం చూ డని కథలని ఎత్తి చూపుతాయి. వాటి శక్తిని అర్థం చేసుకోవడం అంటే ప్రజా విధానాన్ని అర్థం చేసుకోవడమే అని నా అభి ప్రాయం’ అని జొహ్రాన్ వెల్లడించారు. అప్పటినుంచే ప్రపంచంలో నెలకొన్న అసమానతలన్నింటిని అవగతం చేసుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపారు. భారత్, ఇ జ్రాయెల్, పాలస్తీనా వంటి ప్రపంచ రాజకీయ అంశాలపై ఆయన పేర్కొన్న అభి ప్రాయాలు వివాదాస్పదంగా మారాయి.  

బలమైన అభ్యర్థిని ఓడించి

అమెరికాలో వర్జీనియా రాష్ర్ట లెఫ్టెనెంట్ గవర్నర్‌గా డెమోక్రటిక్ పార్టీ నేత గజాలా హష్మీ ఎన్నికై సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆమె 15వ సెనెటోరియల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధిగా ఉన్నారు. వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా సంతతి నేతగా, తొలి ముస్లింగా ఆమె అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. తా జా రేసులో ఆమె రిపబ్లికన్ నేత జాన్ రీడ్ పై పైచేయి సాధించారు. లెఫ్టెనెంట్ గవర్నర్‌గా హష్మీ ఎన్నిక కావడంతో సెనెటోరి యల్ డిస్ట్రిక్ట్‌కు మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.

2019లో తొలిసారిగా హష్మీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ పాతుకుపోయిన ఓ రిపబ్లికన్ నేతపై విజ యం సాధించి వర్జీనియా జనరల్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత ఐదేళ్ల కు సెనేట్‌లో కీలకమైన ఎడ్యుకేషన్, హెల్త్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. పార్టీ కి కీలకమైన విద్య, వైద్యం రంగాల బాధ్యతలు దక్కించుకుని కీలక నేతగా గుర్తింపు పొందారు. గజాలా హష్మీ తల్లిదండ్రులు జియా హష్మీ, తన్వీర్ హష్మీల స్వస్థలం హై దరాబాద్.

1964లో జన్మించిన ఆమె తన చిన్నతనంలో మలక్‌పేట్‌లోని తన అమ్మ మ్మ తాతయ్యల ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడి తో కలిసి అమెరికాలోని జార్జియా రాష్ర్టంలో ఉంటున్న తన తండ్రి వద్దకు వెళ్లారు. గజాలా తండ్రి జియా.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎమ్‌ఏ ఎల్‌ఎల్‌బీ చేశా రు. ఆ తరువాత దక్షిణ కెరొలీనా యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారా ల్లో పీహెడీ చేశారు. అనంతరం అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. ఆమె లెజిస్లేచర్‌గా పనిచేసిన  కాలంలో ప్రజా విద్య, ఓటు హ క్కులు, ఆరోగ్య సేవలు, పర్యావరణ సంరక్షణ అంశాలపై చురుకుగా పని చేశారు. 

రాజకీయ ఎదుగుదల

ఓహియో రాష్ర్టం సిన్సినాటి నగర మేయర్‌గా అఫ్తాబ్ కర్మసింగ్ పురేవల్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన 2021 లో తొలి ఆసియా మూలాల మేయర్‌గా ఎన్నికై, ఈసారి రిపబ్లికన్ ప్రత్యర్థిని ఓడించి రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అఫ్తాబ్ పురేవాల్ కూడా చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చినవారే. ఆయన తల్లి చైనా ఆక్రమణ సమయంలో టిబెట్ నుంచి భారత్‌కు శరణార్థిగా వచ్చా రు. భారత్‌లోనే చ దువుకున్నారు.

పం జాబీ వ్యక్తి పురేవాల్‌ను వివాహం చేసుకున్నారు. కర్మసింగ్ జన్మించిన తర్వాత కొన్నే ళ్లకు ఆ కుటుంబం అమెరికాలోని ఓహియోకు వెళ్లి స్థిరపడింది. అమెరికాలో తమ కుమారుడి జీవితం ఉజ్వలంగా ఉండాలన్న ఆకాంక్షతో ఆఫ్తాబ్ అని పేరుపెట్టారు. పర్షియన్‌లో ఆ పదానికి ‘సూర్యకాంతి’ అని అర్థం. పొలిటికల్ సైన్స్, న్యాయశాస్త్రం చదివిన ఆఫ్తాబ్ పురేవాల్.. 2021 లోనే సిన్సినాటి పట్టణ మే యర్‌గా ఎన్నికయ్యారు.

తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి కోరీ బోమాన్‌పై విజయం సాధించారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకా రం, అమెరికన్ నగరాలు, రాష్ట్రాల్లో భారతీయ మూలాల నాయకులు ఎదగడం, వలసదారుల కృషి, విద్య, సామాజిక సేవల రం గాల్లో వారి బలమైన పాత్రను ప్రతిబింబిస్తోంది. ఈ నాయకుల ఎదుగుదల, అమె రికా రాజకీయ వ్యవస్థ పైనే కాక ప్రపంచ సమగ్రత వైపు సాగుతున్నదనే సంకేతాన్ని  ఇస్తున్నది.

మమ్దానీ న్యూయార్క్ నగర పా లనలో అడుగుపెడుతుండగా, హష్మీ వర్జీనియా రాష్ర్ట రాజకీయాల్లో కీలక బా ధ్య తలు స్వీకరించనుండగా.. పురేవాల్ ఓ హి యో రాష్ట్రంలో సిన్సినాటి నగరంలో తన రెండో పదవీ కాలాన్ని ఘనంగా ఆరంభించనున్నారు. ఈ ముగ్గురు నాయకుల పా లనా నిర్ణయాలు రాబోయే సంవత్సరాల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. రాబోయే రోజుల్లో మెరుగైన పౌర సమాజం కోసం.. మూల స్తంభాలైన సామాజిక, సమగ్రత, సోషలిజం, ప్రజాస్వామ్యం వైపు ఈ త్రయం అడుగులు వేస్తారని ఆశిద్దాం.

వ్యాసకర్త సెల్:  9989988912