calender_icon.png 7 November, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశభక్తిని నింపిన వందేమాతరం

07-11-2025 12:03:30 AM

నర్సింగు కోటయ్య :

నేటికి 150 ఏండ్లు పూరైన సందర్భంగా

వందేమాతరం నినాదం లేని స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఊ హించలేం. ఆనాడు బ్రిటిష్ వాళ్లు వెయ్యి ఫిరంగులు ఎక్కు పెడితే మన భారతీయులు వందేమాతరం నినాదంతో వెయ్యి ఫిరంగులకు మించిన భయాన్ని బ్రిటిష్ వారిలో పుట్టించారు. ఆ నినాదాన్ని పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు నినదించారు. నరనరాన దేశభక్తిని నింపిన వందేమాతరం గేయం లో భారతదేశ గొప్పదనం తెలుస్తుంది. బ్రిటిష్ వారి మెడలు వంచిన నినాదం మన వందేమాతరం. 

అంతగొప్ప స్ఫూర్తి ని, ఉద్యమకాంక్షను రగిలించిన వందేమాతరం గేయం ఇవాళ జాతీయ గే యంగా మారిపోయింది. దీనిని 1875లో నవంబర్ 7న బంకిమ్ చంద్ర ఛటర్జీ రాశారు. ఆయన రచించిన బెంగాలీ నవల ‘ఆనంద్ మఠ్’లో ఈ గేయాన్ని పొందుపరిచారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవం నేడు దేశవ్యాప్తంగా ప్రజలు ఘ నంగా జరుపుకోన్నారు. నిర్ణీత సమయంలో ప్రజలు ఎక్కడున్నా అక్కడే నిలబ డి వందేమాతర గేయాలాపన జరపాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ఈ గే యాలపాన వేడుకను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. నాడు, నేడూ కోట్లాది మంది భారతీయులను ఏకం చేస్తున్న వందేమాతరం పాట స్వాతంత్య్ర సమరయోధుల నినాదం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో నిరసనలు, సమావేశాలు, కాంగ్రెస్ సమావేశాల ద్వారా వందేమాతరం గేయం ప్రతిధ్వనించి ప్రజల్లో అంతులేని ధైర్యం, ఐక్యత లను కలిగించింది. బంకించంద్ర ఛటర్జీని ‘ఛటోపాధ్యాయ్’ అని పలకలేక బ్రిటిష్ వారు ‘ఛటర్జీ’ అని పిలువసాగారు. పేరుకు బ్రిటిష్ కొలువులో పనిచేస్తున్నప్పటికీ భారతీయ ఆత్మతోనే నిరంతరం పనిచేశారు. 

హిందూ, ముస్లింల తిరుగుబాటు

ఆంగ్లేయుల గుండెల్లో ప్రమాద ఘంటికలు మోగించిన వందేమాతర గేయం, పదం స్వాతంత్రోద్యమ నాయకుల నుంచి సామాన్యుల వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించింది. పూర్వం కానీ, ఇటీవల కాలంలో కానీ ప్రపంచ సాహిత్య చరిత్రలో, జాతుల విముక్తి పోరాటాల్లో, స్వా తంత్య్ర సమర చరిత్రల్లో ఒక మహాకవి రచించిన దేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి ఉద్యమింపజేసిన సంఘ టన మరొకటి నమోదు కాలేదంటే అతిశయోక్తి కాదు.

భారతీయుల ఐహిక, పర మార్థ జీవితాలు బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో క్షీణ దశకు చేరే ప్రమాదాన్ని నివారిం చడానికి సన్యాసుల సమరం సాగింది. బంకిం చంద్ర ఛటర్జీ వందేమాతరం నవల రాయడానికి వందేళ్లకు ముందు 1773లో ఉత్తర్ ప్రదేశ్‌లో కొందరు సన్యాసులు ఇంగ్లీష్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉద్యమించారు. 1770 ప్రాంతంలో కరువుతో ప్రజానీకం అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో లక్షల మందికి పైగా మరణించారు.

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల పన్నుల పీడనానికి వ్యతిరేకంగా హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఏక మై చారిత్రాత్మక తిరుగుబాటు చేశారు. వా రు కంపెనీ ఖజానాలను, ఆహార గోదాములను దోచుకొని పేద ప్రజలకు పంచిపె ట్టారు. నిజానికి బంకిం చంద్ర ఛటర్జీ రాసి న ‘ఆనంద్ మఠ్’ నవల రచించేందుకు హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్ల తిరుగబాటు ఉద్యమమే స్ఫూర్తిగా నిలిచింది. 

దేశభక్తిని, జాతీయవాదాన్ని రగిల్చేలా సాగిన ఉద్యమ ఘటనల గురించి ‘ఆనంద్ మఠ్’ నవల కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రస్తావనలు ఎన్నో ఉన్నాయి. ‘ఆనంద్ మ ఠ్’ నవల 1882లో ప్రచురితమైంది. 1884 ఏప్రిల్ 8న బంకిం చంద్ర ఛటర్జీ మరణించాకా 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వ రకల్పన చేసి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు. అక్కడి నుంచి వందేమా తర గేయం అందరి నోళ్లలో నినాదంగా మారింది. ఇది బ్రిటిష్ వారికి శత్రు నినాదంగా మారడంతో పాటు భారత జాతీయ చరిత్రలో ఒక నూతన శకానికి నాంది పలికిన ఉద్యమంగా రూపాంతరం చెందింది.

బెంగాల్ విభజన

హిందూ, ముస్లిం ఐక్యతను దెబ్బ తీయ డం, విభజించు సిద్ధాంతంతో హిందువులను, ముస్లింలను విడదీస్తూ రెండు రాష్ట్రాలుగా చేస్తూ వైస్రాయ్ లార్డ్ కర్జన్ 1905 జూలై 20న బెంగాల్ విభజన అధికార ప్రకటన చేశాడు. తూర్పు ప్రాం తాలైన ఢాకా, ఫరీదాపూర్, ఐకార్ గంజ్, నవాఖలీ, చిట్టగాంగ్ ప్రాంతాలు, అస్సాం తో కలిసి తూర్పు బెంగాల్‌గా ఏర్పాటు చేశారు. దీని రాజధాని ఢాకా, ఉప రాజధాని చిట్టగాంగ్ బెంగాల్ పశ్చిమ ప్రాంతం.

బీహార్, ఒరిస్సా, సెంట్రల్ ఫ్రావిన్స్ నుంచి వేరు చేసిన శంబల్ పూర్ కలిసి పశ్చిమ బెంగాల్‌గా (కలకత్తా రాజధాని) ఏర్పాటు చేశారు. ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేక ఉద్యమం 1905 ఆగస్టు 7న ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ‘వందేమాతర ఉద్యమం’ అని అశ్వనీకుమార్ దత్త నామకరణం చేశారు. వందేమాతరం అనగా ‘మాతృభూమికి నమస్కారం’ అని అర్థం.

ఈ ఉద్యమంలో ప్రజలంతా వందేమాతరం గీతాన్ని ఆలపించడం, ఒకరి నొకరు పలకరించుకోవడం సహా అన్ని విషయాల్లో వందేమాతరం అనే పదాన్ని ఊతపదంగా ఉపయోగించడం విశేషం. ఈ ఉద్యమంలోనే విదేశీ వస్తువులను బ హిష్కరించి స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల దీనికి స్వదేశీ ఉద్యమం అని కూడా పేరు వచ్చింది. 

స్వాతంత్య్ర కాంక్ష

వందేమాతరం గీతం స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమకారులకు స్ఫూర్తి నిచ్చింది. వందేమాతర ఉద్యమం బెంగాల్‌కు పరిమిత కాకుండా దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమం గా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది. ఈ ఉద్యమాన్ని బెంగాల్ నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం లో బిపిన్ చంద్రపాల్ కీలక పాత్ర పోషించారు. 

బెంగాల్‌లో బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్, బరిసాల్‌లో అశ్వనీకుమార్, దత్తపంజాబ్, ఉత్తరభారత్‌లో లా లాలజపతి రాయ్, అజిత్ సింగ్, హన్స్‌రాజ్, పశ్చిమ భారత్‌లో తిలక్, పరంజపే, మద్రాస్‌లో చిదంబరం పిళ్లు ఉద్యమానికి నాయ కత్వం వహించారు. ఆంధ్ర ప్రాం తంలో కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు నేతృత్వం వహించి ఉద్యమాన్ని విస్తరించారు.

స్వరాజ్య పాలన అందించడమే ధ్యేయం గా లాల్, బాల్, పాల్, గోష్‌లు ఉద్యమం నడిపించారు. అందరూ వందేమాతరంలో స్వాతంత్య్ర కాంక్షను చూశారు. కానీ మతం కోణం చూడలేదు. దీంతో వందేమాతరం దేశం మొత్తం వ్యాపించింది. భారతీయు ల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1950, జన వరి 24న రాజ్యాంగ సభ ‘వందేమాతర’ గీతాన్ని ‘జనగణమనతో’ సమానంగా గౌరవిస్తూ జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది.

వ్యాసకర్త సెల్: 9985930885