calender_icon.png 18 August, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐతన కుంట ఆక్రమణదారులపై కొరడా ఝుళిపించాలి

18-08-2025 12:00:57 AM

సీపీఎం సీనియర్ నాయకుడు నెల్లూరు నాగేశ్వరరావు 

మణుగూరు, ఆగస్టు 17 ( విజయ క్రాంతి ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పరిధిలోనిఐతన కుంట ఆక్రమణ దారులపై అధికారులు కొరడా జులిపించాలని, సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరు నాగేశ్వర రావు, మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం ము త్యాలమ్మనగర్ పంచాయతీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సివిల్ ఆఫీస్ ప్రహరీ గోడ నుండి అనేక గృహలు కుంటలోనే ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలతో వరద ప్రమాదం ఉందని, చెత్త ,వ్యర్ధలు పేరుకుపోవ డంతో నీరు కలుషితమై పశువులు తాగలేని పరిస్థితి నెలకొందన్నారు.

అధికారులు వెంటనే స్పందించి కుంటలో నిర్మిం చిన ఇండ్లను తొలగించాలని ఐతన కుంట ను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దామల్ల వెంకన్న, బొల్లం రాజు, తోట పద్మ, పల్లపు నాగేశ్వర రావు, లక్ష్మయ్య పాల్గొన్నారు.