calender_icon.png 4 July, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ సారు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి

04-07-2025 08:22:07 PM

చినుకు పడితే చిత్తడిగా మారుతున్న ప్రధాన రోడ్లు

గ్రామస్తులు ఎంపిడిఓని అడిగితే మా వల్ల కాదు.. కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీని అడగండని సమాధానం

అధికారులు నిర్లక్ష్యమే కారణం..!

కాంగ్రెస్ పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ మనోజ్

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో సైడ్ కాలువలు లేకపోవడం వల్ల వర్షపు నీరు నేరుగా ఇళ్లలోకి ప్రవహిస్తూ స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గ్రామ రహదారులపై నిలిచిపోయిన నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పునరావృతమవుతున్న సమస్యపై గ్రామస్తులు శుక్రవారం ఎంపీడీఓ. కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ సమస్యపై ప్రశ్నించగా ఎంపిడిఓ అనిత మాకు ఏమి తెలియదు. నేను నామమాత్రంగా ఉన్నానంటూ గ్రామస్తులకు అసంతృప్తికర సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా "కలెక్టర్కు ఫిర్యాదు చేయండి అంటూ అధికారి చేతులెత్తేసినట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ గ్రామ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ స్పందిస్తూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఎన్నోసార్లు కార్యదర్శిని అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎంపిడిఓని ప్రశ్నించినా మా వల్ల కాదు... ఎమ్మెల్యేను లేదా ఎంపీని అడగండి అనే తీరుతో ప్రజలను నిరాశకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.