calender_icon.png 6 January, 2026 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా ఖాందేవ్ జాతర

04-01-2026 12:00:00 AM

  1. తొడసం వంశీయుల ప్రత్యేక పూజలు 
  2. మూడు కేజీల నువ్వుల నూనె తాగిన ఆడపడుచు 

ఉట్నూర్, జనవరి 3 (విజయక్రాంతి): నార్నూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన తొడసం వంశంకుల దైవం ఖాందేవ్ మహాపూజతో జాతర ఉత్సవాలు అంగరంగ వైభ వంగా ప్రారంభమయ్యాయి. పుష్య మాసంలో ఖాందేవ్ జాతర వేడుకలను తొడసం వంశీయులు భక్తిశ్రద్ధలతో తమ సాంప్రదాయలకు అనుగుణంగా నిర్వహించారు. శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. జాతరలో ప్రధాన ఘట్టమైన తుడసం ఆడపడుచు నువ్వుల నూనె తాగే ప్రధాన ఘట్టం ప్రశాంతంగా ముగిసింది.

ఖాందేవ్ (పెద్దపులి) ముందు తొడసం వంశ పెద్దల సమక్షంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లోని తొడసం వంశస్థులు ఇంటి వద్ద నువ్వులతో స్వయంగా తయారు చేసిన నూనెను తీసుకోవచ్చారు. ప్రతి ఇంటి నుంచి తీసుకువచ్చిన నూనెను ఇత్తడి పాత్రలో పోశారు.పెద్దల సమక్షంలో సుమారు మూడు కేజీల నువ్వుల నూనెను తొడసం వంశం ఆడపడుచు సర్పం సక్రు బా యి తాగారు.

గిరిజనులు, గిరిజనేతరులు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ నువ్వుల నూనె తాగడం ప్రారంభించారు. 30 నిమిషాల లోపల మూడు కేజీల నూనె తాగి దేవుడి మన్ననలు పొందారు. ఖాందేవ్ మహాపూజ అనంతరం మరుసటి రోజున నువ్వుల నూనె తాగడం ఎన్నో దశాబ్దాల నుంచి అనవాయితీ వస్తోన్న ఆచారం.ఈ ఆచారాన్ని నేటికి కొనసాగిస్తున్నామని తొడసం వంశ పెద్దలు తెలి పారు. 

మరోవైపు ఖాందేవ్ జాతర సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ దర్శించుకున్నారు. అనం తరం ఏర్పాటు చేసిన సమావేశంలో సుగుణ మాట్లాడుతూ ఆలయం వద్ద తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నాన న్నారు.

ఖాందేవ్ దేవుడు గిరిజనుల సమస్యలను వాళ్ళ కష్టాలను తీర్చుతున్నారని అందు కు నిదర్శనం ఇంటి వద్ద తయారు చేసిన నువ్వుల నూనె మూడు కేజీలను అరగంటలో తొడసం వంశం ఆడపడుచు అందరి సమక్షంలో తాగడమే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు. కార్యక్రమాల్లో నార్నూర్ సర్పంచ్ బానోత్ కావేరి, మాజీ సర్పంచ్ బానోద్ గజానంద్ నాయక్, ఆలయ కమిటీ సలహాదారుడు తొడసం నాగోరావు, తొడసం వంశస్థులు , ఆదివాసీలు  పాల్గొన్నారు.