04-01-2026 12:00:00 AM
మిట్టపల్లి కస్తూర్బా విద్యాలయంలో ఘటన
సిద్దిపేట, జనవరి 3 (విజయక్రాంతి): రాత్రి భోజనం ముగించుకుని తోటి విద్యార్థినుల తో కలిసి ఆడుకుంటుండగా స్పృహ తప్పి కుప్పకూలి విద్యార్థిని మృతి చెందిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. సిద్దిపేట జిల్లా బెజ్జెంకి మండలం కళ్లేపల్లికి చెందిన గుర్రం శ్రావణి, తిరుపతిరెడ్డిల ఇద్దరు కుమార్తెలు మిట్టపల్లి కేజీబీవీలో చదువుతున్నారు.
7వ తరగతి చదువుతున్న హర్షిత (11) శుక్రవారం రాత్రి భోజనం చేసి తోటి విద్యార్థినులతో కలిసి మైదానంలో ఆడుకుంటుండగా స్పృహలప్పి కిందపడింది. ఉపాధ్యాయులు సమీపంలోని సురభి మెడికల్ కళాశాలకు తరలించా రు. చికిత్స అందించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందింది. తిరుపతిరెడ్డి పెద్ద కూతురు వర్ష, ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు.