calender_icon.png 8 January, 2026 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ ఢీకొని గొర్రెలు మృతి

06-01-2026 06:21:44 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండలంలోని సూరారం స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న గొర్రెలను ట్రాక్టర్ ఢీకొని సుమారు 28 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని ఎస్సై సురేష్ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట అశోక్ నగర్ కు చెందిన కర్రెపోలా గజలప్ప గొర్రెలకు మేత కోసం తెలంగాణకు కూరలను తీసుకొచ్చాడని అన్నారు.

అదే క్రమంలో తనకున్న గొర్రెలను సోమవారం వరకు దండేపల్లి మండలంలో మేపి వాటిని మంగళవారం మంచిర్యాల వైపు తీసుకెళ్తుండగా లక్షెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపు సిమెంట్ ఇటుకల లోడుతో వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ తన ట్రాక్టర్ ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ గొర్రెల మంద పైకి రావడంతో 28 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయన్నారు. గొర్రెల యజమాని గజలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.