calender_icon.png 8 January, 2026 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సుంకరి సాయిలు

06-01-2026 06:12:59 PM

విజయక్రాంతి,పాపన్నపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పాపన్నపేట గ్రామానికి చెందిన సుంకరి సాయిలు ఎన్నికయ్యారు. శంషాబాద్ లో గత మూడు రోజులుగా ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఇట్టి మహాసభల్లో టేక్మాల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న సుంకరి సాయిలును రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు.

ఈయన విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మెదక్ జిల్లా ప్రముఖ్ గా సేవలందిచ్చారు. తమపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు జాతీయ, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా, మండల నాయకులు సుంకరి సాయిలు ఎన్నికకు  హర్షం వ్యక్తం చేశారు.