calender_icon.png 8 January, 2026 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

06-01-2026 06:06:42 PM

- 36 గ్రాముల డ్రై గంజాయి స్వాధీనం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాల బెల్లంపల్లిలో గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ సీహెచ్ కరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి విక్రయాలను అరికట్టడంలో భాగంగా బెల్లంపల్లి పోలీసులు చేపట్టిన ప్రత్యేక నిఘాలో ఒకరీనీ అరెస్టు చేసి, అతని నుంచి 36 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

బెల్లంపల్లి టూ టౌన్ పోలీసుల   బృందం మంగళవారo సర్కిల్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో  అనుమానాస్పదంగా కొనూరి  రామకృష్ణ ను అదుపులోకి తీసుకున్నారు. రామక్రిష్ణను విచారించగా 36 గ్రాముల డ్రై గంజాయి ప్యాకెట్‌ లభించింది. మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, బెల్లంపల్లిలో విక్రయిస్తున్నాడు. నిందితుని  నుంచి గంజాయితో పాటు, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు ఆయన నిందితుడు మాలగురిజాల గ్రామానికి చెందినవాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.