calender_icon.png 8 January, 2026 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటలతో అత్యన్నత ప్రతిభ చాటుతున్న విద్యార్థులు

06-01-2026 06:10:12 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ చదువులోనే కాకుండా ఆటల్లో సైతం అత్యున్నత ప్రతిభ చాటుతున్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జెడ్పిహెచ్ఎస్ విద్యార్థులు తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన ఎస్జీఎఫ్ గేమ్స్ లో పాఠశాల స్థాయి నుండి మండల స్థాయి, వివిధ పాఠశాలల్లో నిర్వహించిన జిల్లాస్థాయి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో, రాష్ట్ర స్థాయి ఆటలపోటిలలో చక్కని క్రీడా ప్రతిభ కనబరుస్తున్నారు.

ఈ పాఠశాల మట్టిలో మాణిక్యాలు.ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ నందు వీ, అక్షిత్ గౌడ్, బి, సాన్విక లు సైక్లింగ్ లో  ఆర్,అక్షయ్ కె. రాకేష్ ఎస్ కౌశిక్, బాలికల విభాగంలో ఏ. అక్షయ, ఎం, శ్రేష్ట టేబుల్ టెన్నిస్ నందు పి.ఆదిత్య, వి.రావణ్ బహుళ ధనుష్  (బాలికల విభాగంలో జ్ఞానీత ప్రియా, మీనాక్షిలు కబడ్డీ లో  టి.సమ్మక్క లు తదితరులు వ్యాయామ విద్య ఉపాధ్యాయురాలు  ఆసియా బేగం  శిక్షణలో గర్రెపల్లి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు.ఈ సందర్బంగా విద్యార్థుల కు విద్యార్థుల తల్లిదండ్రుల కు, ఎస్ఎంసి  చైర్మన్, సభ్యులు మంగళవారం అభినందనలు తెలిపారు,