06-01-2026 06:19:17 PM
-లక్ష్మీదేవిపేట సర్పంచ్ బొమ్మకంటి వంశావతి
వెంకటాపూర్,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాలే బాలల భవిష్యత్తుకు పునాది అని లక్ష్మీదేవిపేట గ్రామ సర్పంచ్ బొమ్మకంటి వంశావతి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామం రాజేశ్వరరావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో టీచర్ కొండ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ పిల్లలకు యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి శారీరక, మానసిక వికాసానికి కృషి జరుగుతోందని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల పటిష్ట నిర్వహణ కోసం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం ఉపసర్పంచ్ కొండ తిరుపతిలు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం అంగన్వాడీ టీచర్ మాధవి సర్పంచ్, ఉపసర్పంచ్ లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వినయ్, లీలా, గన్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.