06-01-2026 06:16:43 PM
విద్యార్థులకు అవగాహన సదస్సులో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు
గోదావరిఖని,(జయక్రాంతి): కళాశాల విద్యార్థులు ట్రాఫిక్ పై అవగాహన కలిగి ఉండాలని, గోదావరి ఖని లో విద్యార్థులకు అవగాహన సదస్సులో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు. మంగళవారం సీఐ ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ కాలనీలో గల కాకతీయ జూనియర్ కాలేజ్ లో విద్యార్థులకు అవగాహనలో ఆయన మాట్లాడుతూ... ట్రాఫిక్ పై తల్లిదండ్రులకు టు వీలర్ నడిపేటప్పుడు హెల్మెట్, వాహనానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలని, తాగి బండి నడపద్దని, సెల్ ఫోను మాట్లాడుతూ బండి నడపద్దని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చెప్పాలని సిఐ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, ఎస్సై హరి శేఖర్, కళాశాల సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.