calender_icon.png 8 January, 2026 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత డబ్బులతో పాఠశాల ప్రాంగణం శుభ్రం చేయించిన వార్డు మెంబర్

06-01-2026 06:01:00 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఏటి గూడ గ్రామంలో 10వ వార్డ్ నెంబర్ సడిమెక రాకేష్ పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయించారు. గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శికి చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో సొంత డబ్బులతో పాఠశాల ప్రాంగణాన్ని ట్రాక్టర్ బ్లేడ్ బండితో శుభ్రం చేయించినట్లు తెలిపారు. ఇకనైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలపతి తదితరులు ఉన్నారు.