26-12-2025 01:26:29 AM
సికింద్రాబాద్/కంటోన్మెంట్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ప్రధాని మోదీ పిలుపుతో నిర్వహిస్తున్న ఖేల్ మహోత్సవ్‌ణు విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మహ బూబ్ కాలేజ్, ఎస్‌విఐటి ఆడిటోరియంలో గురువారం ఖేల్ మహోత్సవ్ రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్ కోడ్, పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. “మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెం ట్ నియోజకవర్గంలో 40 డివిజన్ల వారీగా కమిటీలు వేసినట్టు తెలిపారు. జనవరి 10 వరకు రిజిస్ట్రేషన్లు, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 3వరకు పోటీలు ఉంటాయని, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని చెప్పారు. క్రికెట్, కబడ్డి, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.