calender_icon.png 26 December, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి,కరుణ,ప్రేమే క్రీస్తు బోధనలు

26-12-2025 01:27:10 AM

నకిరేకల్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ప్రేమ, కరుణ, శాంతి, సేవ అనే ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి సదా ఆచరణీయమని  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  అన్నారు.  గురువారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేతపల్లి, నకిరేకల్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆయన పాల్గొన్నారు. కేకు కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధనల స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని, సమాజంలో ఐక్యత, సౌహార్దం, మానవ విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, టీపిసిసి మేనిఫెస్టో కమిటీ సభ్యులు చామల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్స్ గాజుల సుకన్య,  నాయకులు లింగాల వెంకన్న, యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు సిపిఎం నాయకులు బోజ్జ చిన్న వెంకులు, ఇనుపాముల సర్పంచ్ బొజ్జసుందర్,  మహేందర్ రెడ్డి క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు..