16-05-2025 11:34:15 PM
కాళేశ్వరంలో దగ్గర ఉండి పర్యవిక్షించిన మంత్రి శ్రీధర్ బాబు క్షేత్ర పరిశీలన
మంథని, కాళేశ్వరం,(విజయక్రాంతి): సరస్వతి పుష్కరాల సందర్భంగా స్నాన ఘట్టాలు భక్తులతో సందడిగా మారాయి. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలకు సరస్వతి ఘాట్ చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఉదయం నుండే భక్తుల రాక తో కాళేశ్వరం సందడిని కలిగించింది. పుష్కర స్నానానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రత్యేకతను గుర్తించి వీరు హారతులు దీప దానాలు, పిండ ప్రదానాలు, పితరులకు తర్పణాలు వదిలారు. పుష్కరాల భక్తులు రెండవ రోజుకు రెట్టింపు కావడంతోవచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, సేవలపై ఆరా తీసి యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. టెంట్ సిటీ కి సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆరోగ్య పరిరక్షణ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అధికారులను కోరారు. మరోవైపు జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేస్తూ సమన్వయ అనేక సమన్వయ లోపాలను గుర్తించి సరి చేయడమే పనిగా పెట్టుకున్నారు. పోలీసులు భక్తులను, అధికారులను, మీడియా సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చాయి. ఈ మేరకు ఆయన స్వయంగా అధికారులు సంప్రదిస్తూ సమన్వయపరచడానికి పూనుకున్నారు. పుష్కరాల వేడుకలు ఇంకా 10 రోజులు కొనసాగనున్న సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీకిరణ్ ఖరే, శాసన సభ్యులు మక్కన్ సింగ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.