30-12-2025 01:27:42 AM
మణుగూరు, డిసెంబర్29,(విజయక్రాంతి): మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరిని జిల్లా కాంగ్రెస్ నాయకులు గురిజాల సోమవారం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పినపాక నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులు, పంచాయతీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు, కాంగ్రెస్ పరిస్థితిపై వారిరువురు గంటకు పైగా చర్చించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గోపి ఆమె దృష్టికి తీసుకువెళ్లారు.
కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలపై చర్చించి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి కార్యకర్తలకు భరోసా ధైర్యం నింపిన గోపి సేవలను పార్టీ తప్పక గుర్తిస్తుందని, త్వరలోనే ఆయనకు సముచిత స్థానం కల్పించేందుకు జాతీయస్థాయి నాయకులతో చర్చిస్తానని, నామినేటెడ్ పదవి ఇప్పించేందుకు కృషి చేస్తానని రేణుకా చౌదరి పేర్కొన్నారని గోపి మీడియాకు వివరించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెంచే విధంగా ముందుకు సాగాలని, రేణుకచౌదరి సూచించారన్నారు.