calender_icon.png 11 December, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖండ2కు లైన్ క్లియర్!

10-12-2025 01:43:38 AM

‘అఖండ2’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. డిసెంబర్ 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ2: తాండవం’. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. కోర్టు కేసు కారణంగా చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.  ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయని పేర్కొంటూ తాజాగా కొత్త తేదీని నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ నెల 11న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్టు తెలిపింది.