10-12-2025 01:44:52 AM
శర్వా హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్తూ వచ్చిన మేకర్స్ సరైన తారీఖు ప్రకటించలేదు. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇచ్చారు.
జనవరి 14న సాయంత్రం 5:49 ప్రీమియర్ షోతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. సాధారణంగా సినిమాలు ఉదయం లేదా తెల్లవారుజామున షోలతో ప్రారంభమవుతాయి. కానీ తొలిసారి ఈ సినిమా సాయంత్రం రిలీజ్‌ను ఎంచుకుంటోంది. ఈ చిత్రానికి కథ: భాను బోగవరపు; మాటలు: నందు సవిరిగాన; సంగీతం: విశాల్ చంద్రశేఖర్; డీవోపీ: జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్; నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.