calender_icon.png 2 October, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలపై ఉండాలి

02-10-2025 12:13:49 AM

దుర్గామాతను దర్శించుకున్న ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్

ఆదిలాబాద్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు దుర్గామాత మండపాలను ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకున్నారు. బోథ్ మండల కేంద్రం, ఇచ్చోడ మండలంలోని పిప్రి గ్రామంలోని దుర్గామాత మండపాల వద్ద ఎంపీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు మహారాష్ట్రలోని ప్రసిద్ధిగాంచిన కేలాపూర్ జగదాంబ మాతను ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకున్నారు.

అదేవిధంగా మావల మండలం గ్రీన్ వ్యాలీ కాలనీలోని త్రిశక్తి దుర్గామాత ఆలయాన్ని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అటు అమ్మవారి దయతో ప్రజలు అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి భారీ సంఖ్యలో ఆదిలాబాద్ నుండి భక్తులు తరలి రావడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల వెంట పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు

నిర్మల్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): నిర్మల్ సారంగాపూర్ మండలంలోని వివిధ గ్రామా ల్లో దుర్గామాత మండపాల వద్ద మాజీ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉత్సవాలను వైభవంగా నిర్మించు కోవాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే నిర్మల్ పట్టణంలో దసరా ఉత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ముందుగా బంగల్ పేట్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ ఏర్పాట్లను, దుర్గా నిమజ్జన శోభయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. 

కరుణించు కనకదుర్గమ్మ

రెబ్బెన, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): మం డలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు శ్రీ మహంకాళీ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని బుధవారం ౧౦రోజు శ్రీ మహి షాసుర మర్దిని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది, అమ్మవారీని దర్శించడానికి వేలాది భక్తులు తరలివచ్చా రు. ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి, ఆలయ ఆస్థాన అర్చకులు మహేష్ శాస్త్రి ఆధ్వర్యంలో మహా చండీయాగం నిర్వహించారు, వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ సుకన్య దంపతులు  ప్రసాద వితరణ చేశారు. గురువారం సాయంత్రం 4:00 పల్లకి సేవ ఊరేగింపు ఉంటుందనీ నిర్వాహకులు తెలిపారు.

మహిషాసురమర్దినిగా దుర్గామాత

మందమర్రి, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని కేకే 1 సిఎస్పి సమీపంలో గల దుర్గ భవాని దేవాలయంలో నిర్వహిస్తున్న నవరాత్రి మహోత్స వాల్లో భాగంగా పదవ రోజైన బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని అవతారం లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మండల తహశీల్దార్ పి సతీష్ కుమా ర్ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆయనకు స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించి, ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నర్సింగ్ భవాని దేవాలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.