calender_icon.png 12 July, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంత బజార్ స్థలం సేఫ్

12-07-2025 01:35:36 AM

  1. దశాబ్దాల కాలంగా డబ్బాలు వేసి కిరాయి వసూల్ 

మరికొందరు సొంత డబ్బాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు 

సర్వే చేసి 20 గుంటల భూమి పత్రాలు గ్రామపంచాయతీకి అప్పగింత 

ఎమ్మెల్యే జి మధుసూదన్ కృతజ్ఞతలు తెలిపిన అడ్డాకుల గ్రామ వాసులు 

మహబూబ్ నగర్ జూలై 11 (విజయ క్రాంతి) : పరలో చేతుల్లో ప్రభుత్వ భూము లు యేండ్ల తరబడి ఆదాయ వనరుగా మా రింది. అడ్డాకుల మండల కేంద్రం ప్రధాన రహదారిపై ఉండడంతో పాటు ప్రధాన ప్రాంతం లో సంత బజార్ లోని భూమిలో మాదంటూ మాది అని ప్రచారం చేసుకుం టూ ప్రత్యేక వ్యాపార సముదాయాలను ఏ ర్పాటు చేసుకొని తమ తమ వ్యాపారాలను కొనసాగించారు.

కొందరైతే డబ్బాలను ఏ ర్పాటు చేసి ఇతరులకు కిరాయి సైతం ఇచ్చా రు. ఈ తతంగం ఏండ్ల తరబడి జరుగుతున్న గత ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికార యంత్రంగా మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్ర వర్తించింది. కొందరు సామాజిక కార్యకర్తలు సొంత బజార్ పై పలుమార్లు ఉన్నత అధికారులకు సైతం ఫిర్యాదులు చేసిన ఆ సొంత బజార్ లో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న డబ్బాలను, వ్యాపార సముదాయాలను  తొలగించే ప్రక్రియ మాత్రం జరగలేదు.

దీం తో చేసేదేమీ లేక ఏండ్ల తరబడి ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఎంతోమందికి మే లు జరుగుతుందని అడ్డాకుల గ్రామ ప్ర జల ఆశాభావం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెరువుతో నేటితో నెరవేరింది. 

- 20 గుంటల భూమి హద్దులు కేటాయింపు..

అడ్డాకుల సంత బజార్ అత్యంత విలువైన ప్రాంతం. ఈ ప్రాంతం మండల కేంద్రా నికి చాలా ఆదాయ వనరు ప్రాంతం కూడా. కొన్ని దశాబ్దాల తరబడి కేవలం ఎవరి ఇష్టానికి వారు వ్యాపార సముదాలను ఏర్పాటు చేసుకొని తమ తమ వ్యాపారాలను కొనసాగించిన విషయం విజితమే. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా సంబంధిత అధికారులను ఈ విష యంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. 

దీంతో పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలించి 20 గుంటల భూమి సంత బజారుకు చెందినటువంటిదని హద్దులు నిర్ణయించి అడ్డాకుల గ్రామపంచాయతీ కి నివేదిక పత్రాన్ని అందజేశారు. అక్కడ గతం లో ఏర్పాటుచేసిన పూర్తిస్థాయిలో డబ్బాలను తొలగించారు. 

- ప్రత్యేక భవన నిర్మాణానికి ప్రతిపాదనలు...

ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనం నుంచి ప్రత్యేక భవనం నిర్మిస్తే ఎంతోమందికి మేలు జరుగుతుందని అడ్డాకుల గ్రామ ప్రజలు కో రుతున్నారు. ఈ దిశగానే ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అవసరమైన చర్యలు తీసుకుం టారని స్థానిక ప్రజాప్రతినిధులు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా చేయడం ద్వారా గ్రామ పంచాయతీ ఆదాయం కూడా పెరుగుతుందని, ఎంతోమందికి ఉపాధి కూడా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చూ పిన చొరవకు అడ్డాకుల మండల వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా ఎంతో ప్రభుత్వ భూమి

జిల్లాలో కేవలం అడ్డాకుల మండలంలో ని కాదు వివిధ మండల కేంద్రాల్లో కూడా వేలాది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ భూములపై ప్రత్యేక చొ రవ చూయించి హద్దులు నిర్ణయించి సం బంధిత గ్రామపంచాయతీలకు అప్పజెప్పితే ప్రభుత్వ భూములు భద్రంగా ఉండే అవకాశాలు ఉంటాయని వారి పేర్కొంటున్నారు.

అధికారులు పూర్తిస్థాయిలో ఈ విషయంపై వెనకడుగు వేయకుండా ప్రభుత్వ భూము లు కాపాడి ప్రజలకు అందించాలని ప్రజల అవసరాల నిమిత్తం వినియోగించుకోవాలని కోరుతున్నారు. 

- ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం..

అడ్డాకుల మండలంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న సంత బజార్ ప్రాంతం ఎవరు అందిన కాడికి వారు ఆధీనంలో పెట్టుకొని ఏండ్ల తరబడి మాదంటే మాదని చెప్పుకున్నారని ఈ విషయంపై పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందని పలువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సం దర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి జిల్లా కార్యదర్శి విజమోహన్ రెడ్డి,మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వేగనాథ్, గ్రామధ్యక్షులు రాములు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు హన్మంతు, మోహన్ రాములు, బాలయ్య, రామన్నఅజమ్ బా య్, ప్రశాంత్ రెడ్డి,జగదీశాచారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశా రు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ జరగాలని వారు కోరుకుంటున్నారు.