calender_icon.png 12 July, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నం వదిలి పల్లెల్లో సేవలు!

12-07-2025 01:37:37 AM

  1. వసతులు మెరుగు పరుస్తున్నాం 

పట్టణ పరిసరాల్లోనే పనిచేస్తాం అనే ఆలోచన వైద్యులు మానుకోవాలి

ప్రాజెక్టులు ఎంత ముఖ్యమో విద్యా వైద్యం అంతే ముఖ్యం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

నాగర్ కర్నూల్ జూలై 11 ( విజయక్రాంతి )తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు ద వఖానాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని నిరుపేదలకు అందించే లక్ష్యంగా తెలంగాణ ప్ర భుత్వం పని చేస్తుందని పట్నం వదిలి పల్లె ల్లో సేవలందించేందుకు వైద్యాధికారులు ముందుకు రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశా ఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నా రు.

శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఎక్సైజ్ పర్యాటక శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిలతో కలిసి ప లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ముందు గా కల్వకుర్తి నుం డి తలకొండపల్లి 22 కిలోమీటర్ల వరకు 65 కోట్ల వ్యయంతో నిర్మించే బిటి రోడ్డు,  కల్వకుర్తి పట్టణంలో 45.50 కోట్లతో నిర్మించే 100 పడకల ఆసుపత్రికి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా మె డికల్ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవంతో పాటు 235 కోట్ల విలువ జేసే 5 50 పడకల నూతన మెడికల్ ఆసుపత్రి భవ న నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ తాగు తాగునీటికి  ప్రాజెక్టులు ఎంత ముఖ్యమో ప్రజలకు విద్య వైద్యం అంతే ప్రాముఖ్యమైనదని ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను పూర్తిస్థాయిలో బాగు చేస్తూ అందుకు అనుగుణంగానే స్టాఫ్ రిక్రూట్మెం ట్ వసతులు మందుల కొరతను అధిగమిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే వైద్యులకు ప్రత్యేక వసతి ఏర్పాట్లను కల్పించేందుకు క్వార్టర్స్టులను నిర్మిస్తా మన్నారు. ప్రధాన రహదారు ల వెంట తర చూ జరుగుతున్న రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్స్‌లో వైద్యం అం దిం చేందుకు ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి జిల్లా కేంద్రంలోనూ మెడికల్ కళాశాల, క్యాన్సర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు అన్ని విభాగాలలో ప్రొఫెసర్లను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. పేదవాడి అమాయకత్వం అవసరాల ను వాడుకొని డబ్బు సం పాదన కోసం పనిచేసే వైద్యులను ప్రజలు విశ్వసించరని విశ్వాసం విశ్వసనీయత ఉన్నప్పుడే బంధా లు బంధుత్వాలు మెరుగుపడతాయన్నారు.

స్థానిక మెడికల్ కళాశాల వి ద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాబోయే కాలంలో వైద్యులుగా ప్రజలకు సేవలు అందించే జూనియర్ డాక్టర్లు పుట్టిన గడ్డను గ్రామాన్ని మరవద్దన్నారు. ఒక వ్యక్తి జీవితాంతం గుర్తుంచుకునే వ్యక్తి కేవలం వైద్యుడినేనని వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని గుర్తు చేశారు. అనంతరం నాగర్ కర్నూల్ మండలం  తుడితుర్తిలో నూతనం గా నిర్మించే ప్రైమరీ హెల్త్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

వారితోపాటు స్థానిక ఎమ్మె ల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయ ణరెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, జనరల్ ఆస్ప త్రి సూపరింటెండెంట్ ఉషారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని స్వరాజ్యలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్  గంగా పురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తదితరులుఉన్నారు.