18-12-2025 12:00:00 AM
చిగురుమామిడి, డిసెంబర్ 17(విజయక్రాంతి): నియోజకవర్గంలోని చిగురు మామిడి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్ లను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్యాంపు కార్యాలయం లో బుధవారం అభినందించారు.
ఇందుర్తి గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్ ,వార్డు సభ్యులను కొండాపూర్ గ్రామ సర్పంచ్ మార్క రాజు గౌడ్ ,ఉప సర్పంచ్ బింగీ రాజేంద్ర ప్రసాద్ వార్డు సభ్యులను ,లంబాడిపల్లి సర్పంచ్ కాటం సంపత్ రెడ్డి ,ఉప సర్పంచ్ నక్కా ఓదెలు,నవాబ్ పేట గ్రామ సర్పంచ్ గుళ్ళ రజిత ,ఉప సర్పంచ్ ఇనగాళ శ్రీనివాస్ రెడ్డి, ఓగులపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం రమాదేవి ,ఉప సర్పంచ్ శంకరి స్వరూప , సీతారాంపూర్ గ్రామ సర్పంచ్ గోగూరి లక్ష్మీ ,ఉప సర్పంచ్ కొత్త శ్రీనివాస్ ,ఉల్లంపల్లి సర్పంచ్ అలువల శంకర్ , ఉప సర్పంచ్ జితేందర్ లను,వార్డు సభ్యులను అభినందించి సత్కరించారు..
మీ గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్న తన దృష్టికీ తీసుకురావాలని పరిష్కారం చేస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.