24-01-2026 12:21:57 AM
వెంకటాపూర్, జనవరి23,(విజయక్రాంతి): మండలంలోని జవహర్ నగర్ గ్రామానికి చెందిన త్రికోవేల నారాయణ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా, ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క తనయుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్య శుక్రవారం జవహర్ నగర్ గ్రామానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా నారాయణ మృతికి గల కారణాల ను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. నారాయణ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సమయంలో అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత, మండల యూత్ ఉపాధ్యక్షుడు రాజు, గ్రామ సర్పంచ్ జైల్ సింగ్, ఉప సర్పంచ్ తిరుపతి కృష్ణ, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జిల్లా యూత్ నాయకులు తిరుపతి, మహిపాల్ రెడ్డి, రాజేష్, సందీప్, నాయకులు పాల్గొన్నారు.