calender_icon.png 24 January, 2026 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌కు స్పీకర్ లీగల్ నోటీసు

24-01-2026 12:22:14 AM

  1. తనపై చేసిన వ్యాఖ్యలను.. వారం రోజుల్లో ఉపసంహరించుకోవాలి
  2. రూ.10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి: గడ్డం ప్రసాద్‌కుమార్

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుక్ ఆనంద్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ లీగల్ నోటీసును పం పారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో రూ.వందల కోట్లు లంచంగా తీసుకుని.. అనర్హత పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్లుగా ఆరోపణలు చేయడం వల్ల సభాపతి పదవిని అవమానించే విధంగా మెతుక్ ఆనంద్ మాట్లాడారని స్పీకర్ ప్రసాద్‌కుమార్ శుక్రవారం పేర్కొన్నారు.

తనపై చేసిన వ్యాఖ్యలను వారం రోజుల్లో  మీడియా ద్వారా బహిరంగంగా ఉపసంహరించుకోవడంతో పాటు అసత్య ఆరోపణలతో మానసిక క్షో భ పెట్టినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లేదంటే న్యాయస్థానాల ద్వారా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని లీగల్ నోటీసులో స్పీకర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుం చి కూడా లంచాలు వసూలు చేస్తున్నట్లుగా విమర్శలు చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వా మ్యంలో, రాజకీయ వ్యవస్థలో ఇతరులపై విమర్శలు చేసే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని, కానీ, నిరాధార ఆరోపణలు చేయడం, అత్యున్నత పదవులను అవమానించి, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదన్నారు.