calender_icon.png 23 October, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాదర్‌గుల్‌కి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు

23-10-2025 12:01:54 AM

మణికొండ (విజయక్రాంతి): మైలారదేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ వాంబే కాలనీ సమీపంలో బుధవారం నాదర్‌గుల్‌కి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగి దగ్ధమైంది.  ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ హరి ప్రసాద్ గమనించి వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కకు నిలిపాడు. సమాచారం అందుకున్న చంద్రాయణగుట్ట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో స్కూల్ విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.