calender_icon.png 23 November, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధైర్యసాహసాల చంద్రకళ!

23-11-2025 01:04:46 AM

యంగ్ హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’తో అలరించబోతున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రపంచాన్ని ఇప్పుడు మేకర్స్ క్యారెక్టర్ బేస్డ్ గ్లింప్స్ ద్వారా పరిచయం చేస్తున్నారు.

తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో అనస్వర రాజన్‌ను ధైర్యసాహసాలున్న ఓ పల్లెటూరి అమ్మాయి చంద్రకళగా పరిచయం చేశారు. తన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం కంటే పెద్ద కలలు కంటూ, మంచి నాటక కళాకారిణిగా ఎదిగి, ఒకరోజు తనకంటూ సొంత నాటక బృందాన్ని స్థాపించాలనే ఆశతో ముందుకు సాగే అమ్మాయి చంద్రకళ. అనస్వర రాజన్ పాత్రను దర్శకుడు ఎంతో అందంగా మలిచినట్టు ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.

ఆమె పాత్ర ఎంత కీలకమో సన్నివేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రోషన్ కెమిస్ట్రీ ఈ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి ప్రేమకథ మనసును తాకేలా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్; డీవోపీ: ఆర్ మధీ; ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.