23-11-2025 01:03:31 AM
ముషీరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న సరూర్ నగర్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.గాలి వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ, తెలంగాణ ఇంచార్జ్ మేజర్ చంద్రకాంత్, అసైన్డ్ ల్యాం డ్స్ ఇంచార్జ్ తోట బాబులతో కలిసి బహిరంగ సభ బ్రోచర్ ను ఆవిష్కరించారు.
అనంతరరం వినోద్ కుమార్ మాట్లాడుతూ 20 లక్షల అసైన్డ్ భూములకు యజమాన్యం హక్కులను కల్పించి నీటి వసతి కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విస్మరిస్తుందని విమర్శించారు. తక్షణమే అసైన్ భూములకు యాజ మాన్యం హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ధరణి పేరిట పేదల భూములను లాక్కుందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు బీసీల ద్రోహులని విమర్శించారు. ఆర్ పీఐలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పీ.శ్రీనివాస్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.