calender_icon.png 17 December, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా మెయింటెనెన్స్ డిపో కోసం ఎగిసిన ఉద్యమం

17-12-2025 12:27:43 AM

మానుకోటలో భారీ ర్యాలీ

మహబూబాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): మానుకోట జిల్లా అభివృద్ధికి రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో అవసరమని, మానుకోట ప్రాంతంలోనే మెగా మె యింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కేం ద్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించా రు. విద్యార్ధి సంఘాలచే విద్యార్థులు ఉద్యమ స్ఫూర్తితో మానవ హారం నిర్వహించారు. మహబూబాబాద్ కు రైల్వే మెగా మెయిన్టేనేన్స్ డిపో సాధన కోసం స్థానిక కుమరంభీ మ్ విగ్రహం నుండి విద్యార్థు ర్యాలీ నిర్వహించి  ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో మానవ హారం నిర్వహించారు.

ఈ సందర్బంగా వి ద్యార్ధి, డిపో సాధన కమిటీ బాధ్యులు మా ట్లాడుతూ దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని మహబూబాబాద్ లో 908.15 కోట్ల తో మె గా మెయిన్టెనెన్స్ డిపో ఏర్పాటు చేయడానికి గత అక్టోబర్ లోనే ఉత్తర్వులు విడుదల చేశారని చెప్పారు. ప్రతిపాదిత డిపోలో పీరియా డికల్ ఓవర్హాలింగ్, రెగ్యులర్ ఓవర్హాలింగ్, సిక్ లైన్, ట్రైన్ ఎగ్జామినేషన్ వంటి సదుపాయాలు ఉంటాయన్నారు.

దీనివలన ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ మెగా డిపో ను వదులు కోవడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని, రైల్వే అధికారులు తమ నివేదికలో మానుకోట డిపో ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గు ర్తించాలన్నారు. ఇప్పటికే ఈ డిపో సాధనకు స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగానే ఉందని, రాజకీయంగా ఇ క్కడినుండి తరలించే ప్రయత్న నాన్ని ఉద్యమ స్ఫూర్తితో అన్నీ రాజకీయ, కుల, ప్రజా, విద్యార్ధి, ఇతర సంఘాలు అడ్డుకునే విదంగా ఒకే గొంతుకతో పోరాడు దామని వక్తలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో విద్యార్ధి సంఘా లు ఎస్ ఎఫ్ ఐ, పీడీఎస్ యు, విజేఎస్, డి ఎస్ ఎఫ్ ఐ, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, పలు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు,  పట్ల మధు, బోనగిరి మధు, నాగరా జు, ఇరుగు మనోజ్, కేలోత్ సాయి, గుగులోత్ సూర్య ప్రకాష్, సాధన కమిటీ కన్వీనర్ డోలి సత్య నారాయణ, కో ఆర్డినేటర్ మైస శ్రీనివాసులు, ఖలీల్, ఎండీ ఫరీద్, గౌని ఐలయ్య, మండల వెంకన్న,

ప్రేంచంద్ వ్యాస్, గుగులోత్ బీమానాయక్, నిమ్మల శ్రీను, బోడ రమేష్, వై. కృష్ణప్రసాద్, కుమ్మరికుంట్ల నాగన్న, సంపంగి రాంచంద్రు, షేక్ జానీ, సోమా విష్ణు వర్ధన్, దుగ్గి గోపాల్, అడపా మల్లికార్జున్, దుగ్గి లింగమూర్తి, కుర్ర మహేష్, ఎండీ ఖాజా పాషా, ప్రసాద్ రమేష్, కంబాలపల్లి సత్యనారాయణ, హలవత్ లింగ్య, సామ పాపయ్య, పాటుగా వందలాది విద్యార్థులు పాల్గొన్నారు.