17-12-2025 12:28:55 AM
మహబూబాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల తుది పో రు బుధవారం జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 530 పంచాయతీలకు సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలో 100, హనుమకొండలో 67, జనగామలో 88, జయశంకర్ భూపాలపల్లి లో 78, ములుగులో 45, మహబూ బాబాద్ లో 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మహబూబాబాద్ జి ల్లాలో డోర్నకల్, గంగారం, కొత్తగూడా, కు రవి, మరిపెడ, సీరోల్ మండలాల్లో చివరి వి డత ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగ ల్ జిల్లాలో నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, హనుమకొండ జిల్లాలో ఆత్మకూర్, దామెర, నడికుడ, శాయంపేట, జనగామ జిల్లాలో దేవదుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మలహర్రావు, మహాదేవపూర్, మహా ముత్తారం, కాటారం, ములుగు జిల్లాలో వెంకటాపురం, వాజేడు, కన్నాయి గూడెం మండలాల్లోని గ్రామాల సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు.
తుది పోరు పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుం డా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం గ్రామాలకు మండల కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రి తరలించారు.
ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, భోజన విరా మం అనంతరం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. వీలైన చోట ఉపసర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే ఉమ్మ డి వరంగల్ జిల్లాలో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగం మూడో విడత కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.