calender_icon.png 30 July, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట నిలుపుకున్న మున్సిపల్ చైర్మన్

26-11-2024 06:49:09 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో గత పది రోజుల క్రితం ఏడవ వార్డు ప్రజలు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్‌కు సమస్యలలో ఒకటైనా బోర్‌లో నీరు తక్కువగా వస్తున్నాయని విన్నవించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం ఎల్లారెడ్డిలోని ఏడవ వార్డులోని బోర్‌లో నూతన మోటర్ బిగించి వార్డు ప్రజలకు నీటి సమస్యలను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అందజేశారు. ఎల్లారెడ్డిలోని రజక, బెస్తా, ముదిరాజ్, వీధుల్లో సీసీ రోడ్లు త్వరలోనే పూర్తి చేయాలని ఏడవ వార్డులోని మిగితా సమస్యలను పరిష్కారించాలని ఈ సందర్భంగా ఆయన కొరారు.