26-12-2025 01:30:55 AM
న్యాయవాది నందిగామ నరేందర్
హైదరాబాద్, డిసెంబర్ 25(విజయక్రాంతి): రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో జా తీయ షెడ్యూల్ కాస్ట్స్ కమిషన్(ఎన్‌సీఎస్‌సీ) కీలకపాత్ర పోషిస్తుందని స్థానిక న్యాయవాది నందిగామ నరేందర్ పేర్కొన్నారు. దళితుల హక్కుల పరిరక్షణలో రాజ్యాంగ కవచంలా నిలుస్తుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 కింద ఎన్‌సీఎస్‌సీ స్థాపించారన్నారు. షెడ్యూల్ కాస్ట్స్, ఆంగ్లో- ఇండియన్ సమాజ హక్కులను రక్షించడం, అభివృద్ధి చేయడం. రాజ్యాంగ నిర్మాతలు సామాజిక న్యాయం, సమానత్వం, చారిత్రకంగా వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను నివారిం చేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారన్నా రు.
రాజ్యాంగం, చట్టాల ద్వారా కల్పించిన రక్షణలను పర్యవేక్షించడం, హక్కుల హ ననం జరిగితే ఫిర్యాదులను విచారించడం, అభివృద్ధి ప్రణాళికలపై సలహాలు ఇవ్వడం, రాష్ట్రపతికి వార్షిక నివేదికలు సమర్పించడం ముఖ్యమైనన్నారు. ఆర్టికల్ 338లోని క్లాజ్ 4, 5, 8, 9, 10 ద్వారా కమిషన్ అధికారాలు నిర్దేశించబడ్డాయి. క్లాజ్ 4 ప్రకారం కమిషన్ తన స్వంత విధానాలను రూపొందించుకోవచ్చు.
క్లాజ్ 5లో దళితుల హక్కుల పరి రక్షణ, ఫిర్యాదుల విచారణ, అభివృద్ధి ప్రణాళికలపై సలహాలు ఇవ్వడం వంటి బాధ్యతలు ఉన్నాయి.క్లాజ్ 8 ద్వారా కమిషన్‌కు సివిల్ కోర్ట్ అధికారాలు కల్పించబడ్డాయి. క్లాజ్ 9 ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పై ప్రభావం చూపే ప్రధాన విధానాలపై కమిషన్ను సంప్రదించాలి. క్లాజ్ 10లో ఇతర వెనుకబడిన వర్గాలు, ఆంగ్లో-ఇండియన్ స మాజం కూడా ఈ పరిధిలోకి వస్తాయి అని సూచించారు.
కమిషన్ మూడు ప్రధాన విభాగాల ద్వారా పనిచేస్తుంది. మొదటిది అత్యాచారాలు అండ్ రక్షణ విభాగం, ఇది దళితులపై జరిగే ఘోర నేరాలు, పోలీసు ఎఫ్‌ఐఆర్ ఆలస్యం, కులదూషణలు, శారీరక దాడులు, బెదిరింపులు, ఆస్తి ధ్వంసం, బాని స శ్రమ, కనీస వేతనాల ఉల్లంఘన, పిల్లలపై నేరాలు వంటి అంశాలను పరిష్కరిస్తుంది. రెండవది సేవా రక్షణ విభాగం, ఇది ప్రభు త్వ, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అమలు, ఉద్యోగ వివక్ష, అన్యాయ సస్పెన్షన్, ప్రమోషన్ నిరాకరణ, తప్పుడు కుల ధృవపత్రాల సమస్యలను పరిశీలిస్తుంది. మూడ వది అభివృద్ధి & సంక్షేమ విభాగం, ఇది భూమి కేటాయింపు, విద్యా స్కాలర్‌షిప్‌లు, వాణిజ్య అవకాశాలు, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక సహాయం, గృహ సదుపాయాలు, ప్రజా సేవల్లో వివక్ష వంటి అం శాలను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.