26-12-2025 01:29:14 AM
భద్రాచలం, డిసెంబర్ 25, (విజయక్రాంతి):అందం, విశ్వాసం, ప్రతిభ , ఉద్దే శ్యాన్ని జాతీయ వేదికపై జరుపుకునే జైపూర్‌లో ఈ నెల 19 నుంచి 21 వరకు ఎంతో వైభవంగా జరిగిన ఫరెవర్ మిస్ టీన్ ఇండి యా గ్రాండ్ ఫినాల్‌లో భద్రాచలం చెందిన ప్రీతి యాదవ్ గెల్చుకుంది. రాయల్ ఆర్చిడ్, జైపూర్ అధికారిక స్టూడియోలతో సహా ప్రీమియం వేదికల ద్వారా ఈ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించారు.
దేశం నలుమూలల నుంచి 10,000 కంటే ఎక్కువ దరఖాస్తులు రాగా వాటిని న్యాయ నిర్ణేతలు సమగ్రంగా పరిశీలించి 101 మంది పోటీకి ఎంపిక చేశారు. ముగింపు ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భద్రాచలానికి చెందిన పానీ పూరి వ్యాపారి ప్రకాష్ యాద వ్ కుమార్ కుమార్తె ప్రీతియాదవ్ ఫరెవర్ మిస్ టీన్ తెలంగాణ 2025 కిరీటాన్ని గెలుచుకుంది. విషయం తెలుసుకున్న పలువురు హర్షం వ్యక్తం చేశారు.