calender_icon.png 24 January, 2026 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ దేవి విగ్రహానికి నూతన షెడ్ ప్రారంభం

24-01-2026 12:00:00 AM

భిక్కనూర్, జనవరి 23 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం ఉదయం శ్రీ సరస్వతి దేవి విగ్రహానికి నూతనంగా నిర్మించిన షెడ్ను ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల సౌకర్యార్థం, విగ్రహం సురక్షితంగా ఉండేందుకు ఈ షెడ్ను తమ స్వంత ఖర్చులతో నిర్మించి అందించిన దాత శ్రీ సృజన్ పంతులు గారి సేవలు అభినందనీయమని గ్రామస్తులు కొనియాడారు.

ఈ సందర్భంగా దాత శ్రీ సృజన్ పంతులు మాట్లాడుతూ, విద్యార్థులు నిత్యం ప్రార్థనలు నిర్వహించుకునేందుకు, దేవత విగ్రహం వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ పొందేందుకు ఈ షెడ్ ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక పూజకు పూజా దాతగా పెంటల తిరుపతి గౌడ్ గారు వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెంటల నర్సా గౌడ్, తిరుపతి గౌడ్, మెజీషియన్ సంతోష్, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వార్డు నెంబర్ పోలు నరేందర్, పోలు శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొని దాతకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యా సంస్థలకు ఇలాంటి సేవలు ఎంతో ప్రోత్సాహకరం. విద్యార్థుల ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడే ఈ సేవకు పాఠశాల తరపున దాతకు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు.