31-12-2025 01:26:53 AM
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాం తి): టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు యాదాద్రి భువనగిరి, జగిత్యాల, మెదక్ జిల్లా నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మూడు జిల్లాలో కేవలం 660 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాయనున్నారు. ఏ జిల్లాల్లో ఎన్ని కేంద్రాల్లో, పరీక్ష రాసే అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటించారు. యాదాద్రి జిల్లా నుంచి అత్యల్పంగా 100 మంది, జగిత్యాల నుంచి 160 మంది, మెదక్ జిల్లా నుంచి 400 మంది పరీక్షకు హాజరు కానున్నారు.
ఈ జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున పరీక్షా కేంద్రాలను కేటాయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 1,017 మంది, ఆదిలాబాద్ నుంచి 1,184 మంది, నల్లగొండ నుంచి 1,557 మంది, సూర్యాపేట నుంచి 2,560 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. టెట్ పరీక్షకు మొత్తం 2,37, 754 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, రంగారెడ్డి నుంచి 77,790 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.
తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నుంచి 72,295 మంది, ఖమ్మం నుంచి 20,547 మంది, హన్మకొండ నుంచి 18,299 మంది, కరీంనగర్ జిల్లా నుంచి 16,390 మంది, హైదరాబాద్ జిల్లా నుంచి 9,539 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 18 జిల్లాల్లో 97 కేంద్రాల్లో 2,37,754 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.