27-07-2024 12:05:00 AM
రాష్ట్రంలో ఆయా ప్రాంతాలకు వెళ్లవలసిన ఆర్టీసీ బస్సు సర్వీసుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యే కించి ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటున్నది. ఆయా సమయాలలో బస్సులలో సీట్లు దొరక్క గంటల తరబడి నిలబడే ప్రయాణించవలసి వస్తున్నది. ఇది వృద్ధులు, మహిళలు, పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆర్టీసీ యాజమాన్యం వెంటనే పొద్దున, సాయం వేళల్లో బస్సు సర్వీసుల సంఖ్యను సాధ్యమైనంత ఎక్కువగా పెంచవలసిందిగా ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అరుణ సాగర్, గద్వాల