calender_icon.png 16 December, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వ్‌వర్

15-12-2025 12:03:29 AM

మనోహరాబాద్, డిసెంబర్ 14 :రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ మనోరాబాద్ మండలం కాళ్లకల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని, సౌకర్యాలను పరిశీలించారు.

ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లు ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.