calender_icon.png 7 August, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌తీరం.. సంధ్యా సమయం

03-08-2025 12:00:00 AM

సాగరతీరం సంధ్యా సమయాన అరుణవర్ణంలో ఉన్న ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేసినా ఎంతో అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది కదా !! కృష్ణమ్మ సోయగం.. ఆహ్లాదాన్నిచ్చే సాగరతీరం.. ఆకట్టుకునే అభయారణ్యాలు.. ఎటుచూసినా పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం.. నదీజలాల మీదుగా తేలివచ్చే చల్లని పిల్లగాలులు. నిశ్శబ్ద ప్రకృతిలో నాగార్జునసాగర్ - ప్రయాణంలో ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు. పక్షుల కిలకిల రావాలు.   ఆకాశాన్ని అందుకోవాలనుకునే ఎత్తున పచ్చని కొండలను, నీలి జలాల్లో తన అందాన్ని చూసుకునే నీలాకాశాన్ని, ఆ పచ్చని కొండల్ని తెల్లని మేఘాలని ప్రతిబింబిస్తూ నిశ్చలంగా కదులుతున్న కృష్ణమ్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయవచ్చు. మధ్యలో పచ్చని ద్వీపాలు కనువిందు చేస్తాయి.

నాగార్జున సాగర్.. చారిత్రక ప్రాంతంలో వెలసిన ఆధునిక దేవాలయం. రైతన్న నీటి అవసరాలతో పాటు విద్యుత్తు అవసరాలను తీర్చే ఈ బహుళార్థసాధక ప్రాజెక్టు ప్రపంచంలోనే ఓ అద్భుతం. ఇక్కడి నాగార్జున కొండపై ఆచార్య నాగార్జునుడు తత్వాలను బోధించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నేటితరంలో పెద్దవాళ్ల నుంచి యువత వరకూ అంతా దూర ప్రయాణాలకు, తెలియని ప్రదేశాలు చూడడానికి ఎక్కువ గా ఆసక్తి చూపుతున్నారు.

ఇందుకోసం ఖర్చుకు వెనకాడటం లే దు. ఇటీవల కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో అ ందమైన ఆధునిక దేవాలయంగా పేరుగాంచిన నాగార్జునసాగర్ పరిసరాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఎత్తున కొండల మధ్య సాగర్ ఆనకట్టే ఒక అద్భుతమని అనుకు ంటే, అక్కడ ఉండే ఒక్కో ప్రాంతం ఒక్కో మధురానుభూతిని అ ందిస్తాయి. జలాశయం మధ్యలో ఉన్న నాగార్జున కొండ, పురావస్తు ప్రదర్శన శాల, బుద్ధవనం అయితే పర్యాటకులను క ట్టిపడేస్తున్నాయి. మరి ఆ పర్యాటక ప్రదేశాలను చూసే ముందు అక్కడి విశేషాలు, వాటి చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం.

రెండు కళ్లు చాలవు

నల్లగొండ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఆనకట్ట ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం శ్రీపర్వతం, విజయపురి, నాగార్జున కొండగా ప్రసిద్ధిగాంచింది. తొలుత ఈ ప్రాంతంలో శాతవాహనులు ఉండేవారు. మూడో శతాబ్దంలో ఇక్ష్వాకులకు నిలయంగా మారింది. నాగార్జునసాగర్ డ్యాంను చూడడానికి రెండు కళ్లు చాలవు అనడంలో అతిశయోక్తి లేదు. గేట్ల ద్వారా నీటి విడుదల దృశ్యాన్ని దగ్గరి నుంచి చూస్తే ఒళ్లు పులకరించడం ఖాయం.

అతిపెద్ద రాతి ఆనకట్ట

14 మీటర్ల ఎత్తు, 13 మీటర్ల వెడల్పుతో 26 గేట్లతో రక్షించబడిన ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట, నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ కృష్ణా నదిపై నిర్మించబడింది. ఈ ఆనకట్ట దాదాపు 11,472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో ఉంది. ప్రస్తుతం ఈ డ్యామ్ 22 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ ప్రస్తుతం ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. హరిత విప్లవంలో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన మొదటి నీటిపారుదల ప్రాజెక్టులలో ఇది ఒకటి. నేడు, ఇది నీటిపారుదల సౌకర్యాన్ని అందించడమే కాకుండా, జలవిద్యుత్‌కు కూడా మూలం.

ఎత్తిపోతల జలపాతం

 సాగర్ మరొక ప్రధాన ఆకర్షణ  ఎత్తిపోతల జలపాతం. ఇది వాస్తవానికి ఒక ప్రసిద్ధ పర్వత ప్రవాహం. ఇది దాదాపు 21.3 మీటర్ల ఎత్తు నుంచి మడుగులోకి వస్తుంది. నక్క వాగు, చంద్రవంక వాగు, తుమ్మల వాగు ఈ సుందర జలపాతానికి జన్మనిస్తున్నాయి. ఇక్కడ రంగనాథ, దత్తాత్రేయ అనే రెండు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఈ జలపాతం నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి దాదాపు 15 మైళ్ల దూరంలో మాచర్లకు వెళ్లే మార్గంలో ఉంది.

ఇక్కడే శ్రీశైలం వరకు వెళ్లే కొన్ని గుహలను కూడా కలిగి ఉంది. అటు సాగర్ ప్రాజెక్ట్, నాగార్జునుడి కొండ, మ్యూజియంను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఎత్తిపోతల పరవళ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలపాతం సు మారు 3 కి.మీ మేర ప్రవహించి చివరకు కృష్ణా నదిలో కలుస్తు ంది. పక్కనే ఉన్న కొండపై నుంచి ఏపీ టూరిజం శాఖ ఒక వ్యూ పాయింట్ ఏర్పాటు చేసింది.

వన్యప్రాణుల అభయారణ్యం

నాగార్జునసాగర్ వన్యప్రాణుల అభయారణ్యం శ్రీశైలంలో ఉంది. దీనిని తరచుగా నాగార్జునసాగర్ శ్రీశైలం అభయారణ్యం అని పిలుస్తారు. దాదాపు 3,568 చ.కి.మీ విస్తీర్ణంలో ఏర్పడిన ఈ భూమి వృక్షజాలం, జంతుజాలంతో సమృద్ధిగా నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఆనుకుని ఉంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీపంలో అటవీ ప్రాంతం, పచ్చని వృక్షాలు, పక్షుల కిలకిలరావాలు, జంతువుల అరుపులు, నెమళ్ల నాట్యాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. ఉల్లాసంగా గడిపేందుకు సరికొత్త థీమ్‌లతో అర్బన్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో నెల్లికల్ బీట్‌లొ 250 ఎకరాల్లో రూ.1.5కోట్లతో అర్బన్ పార్కును ఏర్పాటు చేసింది.

రివర్స్ పంపింగ్

ఇందులోని 8 యూనిట్ల ద్వారా 810 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ముఖ్యంగా వేసవికాలంలో విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి వీలుగా దిగువనున్న నీటిని జలాశయంలోకి రివర్స్ పంపింగ్ చేయడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పవచ్చు. 

అనుపు: ఇది సాగర్ జలాశయానికి అనుకొని ఉన్న ప్రాంతం. ఇక్కడి నది ప్రాంతమంతా బీచ్‌ను పోలిఉండి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది.

బుద్ధవనం

సాగర్ హిల్ కాలనీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యాటక సంస్థ సంయుక్తంగా సుమారు 270 ఎకరాలలో బుద్ధవనం నిర్మిస్తున్నారు. ఇందులో 8 రకాల వివిధ పార్కులను నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రపంచంలోని వివిధ దేశాలలోని బౌద్ధమత స్తూపాలు, బుద్ధుని జననం నుంచి మరణం వరకు తెలియచేసే చిత్రాలున్నాయి. శ్రీలంక ఏర్పాటు చేసిన అవకాన బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

 చందులాల్ భనవత్, నాగార్జునసాగర్

నాగార్జునకొండ మ్యూజియం

నాగార్జునసాగర్ సరస్సు మధ్యలో నాగార్జునకొండ ద్వీపంలో నాగార్జునకొండ మ్యూజియం ఉంది. ఈ బౌద్ధ మ్యూజియం ఆనకట్ట నిర్మాణ సమయంలో తవ్వబడిన వివిధ బౌద్ధ నిర్మాణాలు, కళాఖండాల సేకరణతో నిండిపోయింది. 3వ శతాబ్దానికి చెందిన ఈ సేకరణ చాలా పురాతనమైనది. జాతక కథలతో చెక్కబడిన ప్యానెల్లు, బుద్ధుని రాతి విగ్రహాలు, రాతి యుగానికి చెందిన ఆయుధాలు, పరికరాలు, పాత శాసనాలు మొదలైనవి ఉన్నాయి.

నాగార్జున కొండ సాగర్ నుంచి 23 కి. మీ. దూరంలో బోట్ లాంచ్, స్టేషన్ నుంచి 14 కి. మీ. దూరంలో ఉంటుంది. ఇది కృష్ణానదిలో ఉన్న చిన్న ద్వీపం, ఇందులో 2వ శతాబ్దపు బౌద్ధ నాగరికత యొక్క  తవ్వకాల అవశేషాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల సందర్శించవలసిన ప్రధాన చారిత్రక ప్రదేశాలలో ఇది ఒకటిగా నిలిచింది. నాగార్జునసాగర్ విజయపురి నార్త్ విజయ్ విహార్ నుంచి తెలంగాణ టూరిజం నిర్వహిస్తున్న బోట్ లాంచ్ స్టేషన్ నుంచి బోట్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. 

బోట్ టైమింగ్స్: ఉదయం 9.30, 11.30, మధ్యాహ్నం 1.30 

మ్యూజియం టైమింగ్స్: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలవరకు. శుక్రవారాలు, జాతీయ సెలవు దినాలలో మూసివేయబడుతుంది. 

బోట్ ఫీజు:  పెద్దలకు రూ. 150,   పిల్లలకు రూ. 120.

మ్యూజియం ప్రవేశం :  పెద్దలకు రూ. 20, పిల్లలకు రూ. 10.