12-10-2025 01:08:17 AM
న్యూఢిల్లీ,అక్టోబర్ 11: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఇటీవల ప్రకటించిన భారత జట్టులో రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది. జడేజా వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జడేజా ఈ వార్తలపై స్పందించాడు. ప్రతీ ఆటగాడిలాగానే తనకు కూడా వన్డే వరల్డ్‌కప్ గెలవలన్న కల ఉందన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలని ఉందని, అయితే సెలక్షన్ తన చేతిలో ఉండదన్నాడు.
ఆసీస్ టూర్‌కు ఎంపికకాకపోవడంపై స్పందించిన జడేజా కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ తనకు కారణాలు వివరించారన్నాడు. అక్కడి పిచ్‌లపై జట్టులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు అవసరం లేకపోవడంతోనే ఎంపిక చేయలేదన్నాడు.ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా తనలో ఉందని, మెరుగైన ప్రదర్శన చేయడమే ప్రస్తుతం తన చేతిలో ఉన్న పనిగా చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు జడేజా స్థానంలో అక్షర్ పటేల్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడ్డూ ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు.