14-10-2025 12:52:59 AM
సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల, అక్టోబర్ 13 (విజయక్రాం తి) : పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సోమ వా రం ప్రకటించారు. ప్రతి ఏడాది అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే సందర్బం గా దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీ సు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
‘డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు’ అనే అంశంపై మూడు (తెలు గు, ఇంగ్లీష్, ఉర్దూ) భాషల్లో నిర్వహించే ఈ పోటీలకు ఆరు నుంచి పీజీ చదివే విద్యార్థు లు పాల్గొనవచ్చునన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను ఈ నెల 28లోగా సమర్పించాలని , ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పేరు, విద్యార్హత, ఇతర వివరాలు వెబ్ సైట్ (https://forms.gle/jaWLdt2yhNrMpe3eA)లో నమోదు చేసి, 500 పదాలు మించకుండా వ్యాసాన్ని పేప్ప రాసి జేపీజీ లేదా పీడీఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని సూచించారు.