calender_icon.png 14 October, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ గవాయ్‌పై దాడి రాజ్యాంగంపై దాడే

14-10-2025 12:55:31 AM

ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ మాదిగ

ఆదిలాబాద్, అక్టోబర్ 13(విజయక్రాంతి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు,  పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం  ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఎం.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా ఇంచార్జి సందే కార్తిక్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కార్యాలయం ఎదుట బైఠాయించి, నల్లజెండాలను చేతపట్టుకుని నిరసన నినాదాలతో హోరెత్తించారు.     ఈ సందర్భంగా ఎంఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా ఇన్చార్జి సందే కార్తీక్ మాదిగ మాట్లాడుతూ... జస్టిస్ బి.ఆర్ గవాయ్ మీద రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటు విసిరేయడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది కేవలం గవాయి మీద జరిగిన దాడి కాదు ఇది దేశ రాజ్యాంగన్నీ అనుసరిస్తున్న ప్రతి ఒక్కరి మీద జరి గిన దాడి అని పేర్కొన్నారు. ఈ దాడి ము మ్మాటికి రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. 

ఢిల్లీ పోలీసులు ఈ కేసును సుమోటోగా స్వీకరించి లోతైన విచారణ చేపట్టి ఈ దాడికి పాల్పడ్డ ఆ న్యాయవాదిని, ఈ దాడి వెనకాల ఉన్న రాజ్యాంగ విద్రోహ శక్తులను గుర్తించి సమగ్ర విచారణ చేపట్టలన్నారు. దేశవ్యాప్త ఉద్యమ కార్యచరణలో భాగంగా ఈనెల 17న అన్ని ఎమ్మార్వో ఆఫీసులో ఎదుట నిరసనలు, 22న హైదరాబాద్ నడిబొడ్డున భారీ ప్రదర్శన నిర్వహించబోతున్నందున  వేలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యాలయంలో సీనియర్ నాయకు లు కాంబ్లే బాలాజీ మాదిగ, పసుల శ్రీకాంత్ మాదిగ, సందూరి వినయ్ సాగర్, ఎల్లన్న, ఆరేపల్లి గణేష్, కల్లేపల్లి ప్రేమ్ రాజ్, సుభాష్ పాల్గొన్నారు.