calender_icon.png 21 December, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంటులో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయ్

21-12-2025 01:11:54 AM

ప్రధాని మోదీ నేతృత్వంలో సజావుగా నిర్వహించాం

మహాత్మాగాంధీ కోరుకున్న విధంగా ‘వీబీ-జీ రామ్ జీ’

బీజేపీపై దుమ్మెత్తిపోయడేమ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎజెండా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, డిసెంబర్ 20,  సిటీ బ్యూరో (విజయక్రాంతి): పార్లమెంటు శీతాకాల సమా వేశాల్లో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు సభలో చర్చల్లో పాల్గొనడం కంటే అడ్డంకులు సృష్టిం చడమే లక్ష్యంగా కుట్రలు చేశాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శిం చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  శనివా రం నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థ పునరు ద్ధరణలో కేంద్రం తీసుకున్న కృషిని అయన తెలియజేశారు.

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రె స్ వంటి పార్టీలు సభలో ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ చిత్త శుద్ధి, ప్రభుత్వ పాలన దృఢత్వంతో సమావేశా లు సజావుగా సాగాయన్నారు. నిర్ణయించిన సమయానికి మించి సుదీర్ఘమైన చర్చలు జరపడంతో ప్రజాప్రయోజనాలకు అనుగు ణంగా సమావేశాలు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ చరిత్రలో జరిగిన తప్పిదాలు బయట పెట్టడంతో చివరికి కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. ఈసారి ప్రతిపక్షాలు పార్లమెంటరీ విధానాలకు విరుద్ధంగా ఎంత రాద్ధాంతం చేసినా, అల్లరి చేసినా, బిల్లుల ప్రతులు చించేసినా, గోలచేసినా, సమావే శాలు చాలా అర్థవంతంగా నిర్వహించడం మోదీ ప్రభుత్వ తీరుకు నిదర్శనం అన్నారు.

ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా ‘సర్’ పై చర్చ సుదీర్ఘంగా జరపగా.. కాంగ్రెస్ అసలు నైజం బయటపడి. చివరికి బొక్కబోర్లా పడిందాని అన్నారు. రాహుల్ గాంధీ నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసా ర్లు ఓడిన తరువాత, ఎన్నికల సంఘంపై అనవసర భయాన్ని ప్రేరేపిస్తున్నారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి చేసు కున్న సందర్భంలో.. పార్లమెంటు సమా వేశాల్లో ప్రధాని మోదీ వందేమాతరం సంద ర్భాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారని తెలిపారు.

వందేమాతరం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్క లు చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం మతంతో ముడిపెట్టిందని విమర్శించారు. కాం గ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తున్నారంటూ అసత్య ఆరోపణలతో రాద్ధాంతం చేస్తోంది. ముఖ్యంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింద న్నారు.

దీని పై కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ రంగు పులుముతున్నదని చెప్పారు. కొత్త బిల్లు ప్రధానంగా మహాత్మాగాంధీ కోరుకున్న రామ రాజ్య స్థాపన దిశలో ఉందన్నారు. ఉపాధి రోజులు 100 రోజుల నుంచి 125 రోజులకు విస్తరించబడ్డాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంటి పార్టీల దగ్గర ప్రజా ప్రయో జనాల కోసం ఎటువంటి ఎజెండాలూ లేవ న్నారు. ఈ రెండు పార్టీలూ కేవలం బీజేపీపై రాజకీయంగా దుమ్మెత్తిపోయడం తప్పితే చేసేదేమీ లేదన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా తిరుగులేని ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతోం దన్నారు. తెలంగాణలో కూడా బలపడు తోందని చెప్పారు. గ్రామాల్లో బీజేపీ గెలుస్తోందన్నారు. సర్పంచులుగా ఊహించిన దాని కంటే కూడా ఎక్కువగా బీజేపీ అభ్యర్థు లు విజయం పొందారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.