calender_icon.png 18 December, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు

18-12-2025 12:39:21 AM

  1. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

మూడవ విడత  లో 88.84 శాతం పోలింగ్ నమోదు

మూడవ విడతలో 2,16,765 మంది తమ ఓటు హక్కు సద్వినియోగం

తల్లాడ మండలం పినపాక జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళీ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మూడవ విడతలో భాగంగా ఏడు మండలాల పరిధిలో 168 గ్రామ పంచాయతీలకు, 1372 వార్డులకు నిర్వహించిన పోలింగ్ లో 88.84 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అన్నారు.   

ఉదయం 9 గంటల వరకు 27.45 శాతం, 11 గంటలకు 60.84 శాతం, 1 గంట వరకు 86.65 శాతం పోలింగ్ నమోదైందని, ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని,  వారితో కలిపి మొత్తం ఖమ్మం జిల్లాలో మూడవ విడత 88.84 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. 

మూడవ విడత పోలింగ్ నిర్వహించిన ఏన్కూర్ మండలంలో 89.50 శాతం, కల్లూరు మండలంలో 90.72 శాతం, పెనుబల్లి మండలంలో 88.98 శాతం, సత్తుపల్లి మండలంలో 87.36 శాతం, సింగరేణి మండలంలో 87.29 శాతం, తల్లాడ మండలంలో 88.14 శాతం, వేంసూర్ మండలంలో 90.63 శాతం పోలింగ్ నమోదైందని, మొత్తం 2 లక్షల 43 వేల 983 మంది ఓటర్లకు గాను 2 లక్షల 16 వేల 765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని, మొత్తంగా మూడవ విడతలో 88.84 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కలెక్టర్ అన్నారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తల్లాడ మండలం పినపాక జెడ్పీహెచ్‌ఎస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్,  రెవెన్యూ సిబ్బంది, టెక్నికల్ టీం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.