18-07-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూలై 17: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె చేసిన సుంకాల వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘నాటో చీఫ్ వ్యాఖ్యలు, జరుగుతున్న పరిణామాలను దగ్గ రి నుంచి పరిశీలిస్తున్నాం. భారత ప్రజల ఇంధన అవసరాలు తీర్చడమే మాకు ముఖ్యం.
ఇందు కో సం మార్కెట్లలో ఉన్న అంశా లు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటాం. అదే సమ యంలో ద్వంద్వ ప్రమాణాల పట్ల జాగ్రత్త వహిస్తాం’ అని పేర్కొన్నారు. రష్యాతో భారత్ వాణిజ్యం చేస్తే 100 శాతం సుంకాలు విధిస్తామని, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను శాంతి చర్చలకు ఒప్పించేలా ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలు ఒత్తిడి తీసుకురావాలని నాటో చీఫ్ పేర్కొన్నారు.
దీనిపై కేంద్ర పె ట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సి ంగ్ పురీ స్పందిస్తూ.. రష్యా చమురుపై ఆంక్షలు విధిస్తే భారత్‌కు ప్ర త్యామ్నాయ మార్గాలు ఉన్నాయని తెలిపారు.