calender_icon.png 16 August, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుపరిపాలనకు ఆద్యుడు

16-08-2025 12:00:00 AM

నేడు అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి

భారతదేశ రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన వ్యక్తిగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్టీలకు అతీతంగా ప్రశంసించే అతి తక్కువ వ్యక్తుల్లో ఒకరు.  దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన ఆద్యుడిగా నిలిచారు. విద్యార్థి దశ నుంచే హి ందుత్వం, భారతీయ సంప్రదాయాల పట్ల అపార గౌరవం ఉన్న వాజ్‌పే యి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్) భావాలకు ఆకర్షితుడై 1939లో సంఘ్ కార్యకర్తగా చేరారు.

1947లో ప్రచారక్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ ఏర్పాటుకు పూర్వం ఉన్న భారతీయ జనసంఫ్‌ులో వా జ్‌పేయి బహుముఖ పాత్ర పోషించారు. తన వాక్చాతుర్యంతో పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతుడయ్యారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో వాజ్‌పేయి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వా జ్‌పేయి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించకపోయినా ఆయన సామర్థ్యం తెలిసిన ప్రభుత్వం జైలులో నిర్బంధించింది.

1977లో అత్యవసర పరిస్థితి రద్దు చే సిన తర్వాత, ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో  కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పో షించారు. భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలకు చెందిన నాయకుల్లో ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మొదటి వ్యక్తిగా వాజ్‌పేయి నిలిచారు.

ప్రధానిగా రవాణా సౌకర్యాల ప్రాధాన్యతను గుర్తించి ప్రధాన నగరాలను అనుసంధానించే ‘గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే ప్రాజెక్టు’ సహా గ్రామీణ రోడ్లను మెరుగుపరిచే ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన’ను ప్రారంభించారు. సమాచార వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తున్న డిజిటల్ మీడియాకు ఆజ్యం పోసింది కూడా ఆయనే.

ఆచరణాత్మక, ధైర్యాత్మక, వ్యూహా త్మక చర్యలతో భారత్‌ను ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిచేలా చే శారు. 1998లో వాజ్‌పేయి నాయకత్వంలోనే పోఖ్రాన్ అణు పరీక్షలు ని ర్వహించడం చారిత్రాత్మకం. తనను తాను అణ్వాయుధ రాజ్యంగా బహిరంగంగా ప్రకటించింది. ఇది భారతదేశ వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని బలోపేతం చేసింది. పాకిస్థాన్‌తో శాంతి భద్రత ప్రయత్నాలను సమతుల్యం చేయాలని భావించిన వాజ్‌పేయి అప్పటి పాక్ ప్రధాని  నవాజ్ షరీఫ్‌ను కలవ డానికి లాహోర్‌కు ప్రయాణించారు.

వాజ్‌పేయి తరచుగా తన రాజకీయ ప్రసంగాలను కవితలతో జోడించేవారు. ‘సబ్ కా సాత్- సబ్ కా వికాస్’ అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన మొదటి వ్యక్తి వాజ్‌పేయి కావ డం విశేషం. భారత రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభించిన వాజ్‌పేయిని పార్టీలకు అతీతంగా గౌరవించాల్సిన అవసరం ఉంది.

                        డాక్టర్ శంకర్