15-08-2025 12:00:00 AM
పుల్లెంల గణేష్ :
రాజ్యాంగ పీఠికలోని అంశాలు పేపర్లపై మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప భౌతికంగా అమలు కావడం లేదు. దీనివల్ల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విధానాల్లో సమన్యాయం లోపించి తరతరాలుగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలువబడుతోంది. ఇక మానవాభివృద్ధి సూచిలో అత్యంత వెనుకబాటుకు గురవుతూ వస్తున్నాం.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటితో 79 సంవత్సరా లు పూర్తునప్పటికీ దేశంలోని ప్రతి పౌరుడికి స్వాతంత్య్ర ఫలాలు మాత్రం ఇప్పటికీ సమానంగా లభించడం లేదు. నాటి స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులతో అలుపెరగని పోరాటం చేసి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు. వారి త్యాగాలతో స్వాతం త్య్రం వచ్చినప్పటికీ అనుకున్న విధంగా సంపూర్ణ ప్రగతి సాధించకపోవడానికి కారణాలు అనేకం.
దేశంలోని కుల, మతాల కతీతంగా సాగుతున్న పాలనా వ్యవస్థలో స్వాతంత్య్ర, గణతంత్ర ఫలాలు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయంగా దక్కడం లేదన్న లేదని స్పష్టంగా తెలుస్తోం ది. అవి దక్కినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని మహనీయులు మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ పేర్కొన్నారు. పాలనలో నూ విప్లవాత్మకమైన మార్పులు అవసరమని ముందే ఊహించారు.
రాజ్యాధికారంలో కుల, మతాలకతీతంగా అన్ని సామాజిక వర్గాల్లో సమానత్వం ఉన్నప్పు డే సామాజిక న్యాయం అమలవుతుందని ఆనాడే జోస్యం చెప్పారు. భారతదేశంలో ఉన్న 10శాతం అగ్రవర్ణాలు కేంద్ర, రాష్ర్ట కార్య శాసన న్యాయ నిర్వహణ వ్యవస్థలో అత్యధిక సింహ భాగం ఉండటం మూలం గా, పరిపాలన అంగాల్లో సామాజిక న్యాయం లోపించింది. దీని మూలంగా నేడు భారతదేశంలో సామాజిక న్యాయం లోపించి, దేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడినట్లుగా అనిపిస్తుంది.
అధికారం అగ్రవర్ణాల ఆధీనంలోనే
భారత దేశంలో 90శాతం సంపద అగ్రవర్ణాల చేతిలో ఉంటే, 10 శాతం సంపద అణగారిన వర్గాల చేతుల్లో ఉంది. మరి అలాంటప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా, రష్యాలని వెనక్కి నెట్టెదెప్పుడు.. ముందుకు వచ్చేదెప్పుడు? దేశ పరిపాలన సంపద వ్యాపారము ఇలా సమస్త రంగాల్లో సమాన వాటాను ప్రతి తలకి పంచుకొని దేశ సహజ వనరులను ప్రతి పౌరుడు అనుభవిస్తూ, దేశ అభివృద్ధికి పాటుపడేలా పనిచేయడమే గణతం త్ర రాజ్యానికి నిదర్శనం.
కానీ మన దేశం లో అలా జరగడం లేదు. కేంద్ర, రాష్ర్ట అధికారాలు, సంపద భూమి, సమస్త రం గాలు మైనార్టీలుగా చలామణీ అవుతూ అధికారంలో ఉన్న అగ్రవర్ణాల ఆధీనంలో బంధీ అయ్యాయి. అలాంటప్పుడు దేశం లో మిగిలిన 90 శాతం అణగారిన వర్గా లు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికం గా, సాంస్కృతికంగా వెనుకబాటుకు గురవ్వడం సహజం. ఈ సామాజిక వైరుధ్యా లు ఉండకూడదనే భారత రాజ్యాంగ పీఠికలో సర్వసత్తాక, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని నిర్మించుకున్నాం.
భారతీయ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ప్రతి పౌరుడికి సమన్యాయం ఉండేలా దేశ ఔన్నత్యాన్ని పెం పొందించడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంది. భారతీయ ప్రజలుగా ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామని.. అంబే డ్కర్ చేత రాయబడి అనేక మంది మేధావుల అంగీకారంతో నాడు భారత రాజ్యాం గ పరిషత్తులో రాజ్యాంగం ఆమోదించబడింది.
‘పీఠిక’ రాజ్యాంగానికే పరిమితం
నేడు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను సంపూర్ణంగా అమలు చేయకుండా అదే సూత్రాలకు వ్యతిరేకమైన పాలన జరగుతుంది. దీంతో రాజ్యాంగ పీఠికలోని అంశాలు పేపర్లపై మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప భౌతికంగా అమలు కావడం లేదు. దీనివల్ల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విధానాల్లో సమన్యా యం లోపించి తరతరాలుగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలువబడుతుతోంది.
ఇక మానవాభివృద్ధి సూ చి లో అత్యంత వెనుకబాటుకు గురవుతూ వస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశానికి లేని సహజ వనరులు, మానవ వనరులు ఉండి కూడా మనకంటే చిన్న దేశాలపై ఆధారపడడం సిగ్గుచేటు. విదేశాల నుంచి వస్తువులను దిగుమతులు చేసుకుంటున్నామంటేనే దేశ ఆర్థిక పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందనేది స్పష్టంగా తెలుస్తోం ది.
దేశానికి స్వాతంత్య్రం సాధించుకొని 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ దేశ పౌరులకి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి మౌలిక సదుపాయాలైన గుణాత్మకమైన ఉచిత ఆధునిక విద్య అందడం లేదు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఉచిత వైద్యం అందడం లేదు, లక్షలాది మంది పౌరులకు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధి లభించక నిరుద్యోగులుగా రోడ్ల పై అవకాశాల కోసం వేచి చూస్తున్నారు.
లక్షలాది కుటుంబాలు ఉండడానికి కూడా సరైన ఇండ్లు లేని పరిస్థితి ఏర్పడింది. లక్షల కుటుంబా లు సేద్యం చేసుకుని జీవించడానికి వ్యవసాయ సాగు భూమి సమృద్ధిగా దొర క్కపోవడం దేశం వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. అలాంటప్పుడు స్వాతంత్య్ర, గణతంత్ర రాజ్యంగా మన దేశాన్ని గర్వం గా ఎలా చెప్పుకోగలం?.
నేడు కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవ స్థ ప్రపంచ దేశాలతో పోటీపడుతూ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన మూడవ, నాల్గ వ దేశంగా భారతదేశం అవతరించిందని చెప్తున్నారు. కానీ అగ్రవర్ణాలతో పాటు సమానంగా అణగారిన వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక జీవిన విధానంలో విప్లవాత్మక మార్పు రానప్పుడు, సామాన్య నిరుపేద కుటుంబాలకి కనీస మౌలిక సౌకర్యాలు అందనప్పుడు.. భారతదేశం ఆర్థిక శక్తిగా అవతరించిందో కేం ద్రం పౌరులకు చెప్పాల్సిన అవసరముంది.
దేశంలో 100 కోట్లకు పైగా ఉన్న అణగారిన వర్గాలకి నేటికి మౌలిక సదుపా యాలు లేనప్పటికీ రాజ్యాంగం పుణ్యమా అని కొంత మెరుగైన జీవితాన్ని చూస్తున్నా రు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ రాసి న భారత రాజ్యాంగం చేసిన మేలు తప్ప.. దేశ అగ్రవర్ణ పాలకులు చేసిన మేలు మా త్రం శూన్యం. స్వతంత్ర భారతంలో అణగారిన వర్గాలు.. అస్వతంత్రులుగా మారి కార్మిక, కూలీలుగా వెట్టి చాకిరీ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుండటమే ఇందుకు నిదర్శనం.
కానీ భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించుకున్న తదనంతరం నేటి వరకు కేంద్ర,రాష్ర్ట పరిపాలన వ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకు సమాన వాటా ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒకవేళ దేశ సంపదలో, సమస్త రంగాల్లో సమాన వాటాని పంపిణీ చేసి ప్రభుత్వ అంగాలైన శాసన,కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకి సమా న వాటా ఇచ్చి ఉన్నట్లయితే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు పెద్దన్నగా నిలిచేది.
కాబట్టి ఇప్పటికైనా అగ్రవర్ణ పాలకులు పరివర్తన చెంది, భారతదేశ అభివృద్ధిని దృష్టి లో పెట్టుకొని సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరివర్తన దృష్టిలో పెట్టుకొని రాజ్యాధికారంలోను సమస్త రంగాల్లో దేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సమాన వాటా ఉండేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది. మన పూర్వీకులు సాధించి పెట్టిన స్వాతంత్ర, గణతంత్ర దేశానికి పరిపూర్ణమైన అర్థం వచ్చేలా జీవిం చాలి.
భవిష్యత్తులో అగ్రవర్ణాల భూస్వా మ్య పెట్టుబడిదారీ అసమానత్వ పాలనకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం 10 శాతం అగ్రవర్ణాలకు, 90 శాతం అణగారిన వర్గాలకు మధ్య సమన్యాయం కోస మై మరో స్వాతంత్ర సంగ్రామం పుట్టిన ఆశ్చర్యం లేదు. కుల, మత తారతమ్యాలు లేకుండా ప్రతి పౌరుడికి దేశ స్వాతంత్య్ర, గణతంత్ర ఫలాలు అందించడమే నేడు పాలకులపై ఉన్న తక్షణ కర్తవ్యం.
ఈ విషయాన్ని దేశ పౌరులకు తెలిసేలా ప్రజా స్వామ్యన్ని, రాజ్యాంగాన్ని రక్షించే కీలక భా గమైన మీడియా కూడా నిరంతరం అనేక విధాలుగా దీనిని ప్రచారం చేయాల్సిన అవసరముంది. ఇదే విషయాన్ని మేధావులు, విద్యావంతులు, సామాన్యులు సైతం గ్రహించాలనేది చారిత్రక సత్యం.