29-01-2026 12:32:51 AM
నామినేషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు
నిజామాబాద్ జనవరి 28 (విజయక్రాంతి): నిజామాబాదు జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ 2026 ఎన్నికల్లో భాగంగా నేడు నిజామాబాదు డివిజన్ లోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రంను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నామినేషన్ల స్వీకరణ కేంద్రంను పరిశీలించి, నామినేషన్ ప్రక్రియ గురించి తెలుసుకొన్నారు.
పోలీస్ సిబ్బందికి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని, అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ని పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా నిజామాబాదు ఎ.సి.పి బి. ప్రకాష్, 4.వ టౌన్ ఎస్.హెచ్.ఓ సతీష్ కుమార్, ఆర్.ఓ వెంకటేష్ , ఏ.ఆర్.ఓ శ్రీ రమేష్ గౌడ, వారి సిబ్బంది తదితరులు ఉన్నారు.