29-01-2026 12:33:00 AM
నిర్మల్, జనవరి ౨౮ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీ విజయం ఖాయమని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా వేసి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.