calender_icon.png 11 May, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలో పేదలకు పెద్దపీట

03-05-2025 12:00:00 AM

కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

ఉట్నూర్, మే 2 (విజయక్రాంతి): పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మె ల్యే  వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 39 మం ది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ ... రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కల్యా ణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.