04-07-2025 12:34:46 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూలై 3(విజయక్రాంతి): ప్రభుత్వ వైద్యశాలల్లో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం పెద్దశంకరంపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు.
పీహెచ్ సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు? మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు ప్రజల రక్షించడానికి ప్రజారోగ్యం ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యాధికారులు పాల్గొన్నారు.